ఊదాపచ్చనౌక – 8 by S Sridevi

  1. ఊదాపచ్చనౌక – 1 by S Sridevi
  2. ఊదాపచ్చనౌక -2 by S Sridevi
  3. ఊదాపచ్చనౌక -3 by S Sridevi
  4. ఊదాపచ్చనౌక -4 by S Sridevi
  5. ఊదాపచ్చనౌక -5 by S Sridevi
  6. ఊదాపచ్చనౌక – 6 by S Sridevi
  7. ఊదాపచ్చనౌక – 7 by S Sridevi
  8. ఊదాపచ్చనౌక – 8 by S Sridevi
  9. ఊదాపచ్చనౌక 9 by S Sridevi
  10. ఊదాపచ్చనౌక – 10 by S Sridevi
  11. ఊదాపచ్చనౌక – 11 by S Sridevi
  12. ఊదాపచ్చనౌక – 12 by S Sridevi

“అలా మేము పది మంది శాస్త్రవేత్తలం వివిధ రాజ్యాల నుంచి యోధపురం చేరుకున్నాము. వారిలో ఉదయాదిత్యుడు, కాలనేమి, కర్కోటకుడు, ప్రసన్నచంద్రుడు, పృచ్ఛకుడు…”
“ఆగండాగండి. అన్నీ తెలుగు పేర్లే చెప్తున్నారు?” అంది ధన్య.
“అప్పుడు తెలుగు, తమిళం, కన్నడంలాంటి భాషలు ఎక్కడివి? ఉన్నదల్లా ప్రాకృతం, సంస్కృతం. ప్రాకృతం పామరుల భాష. సంస్కృతం పండితుల భాష. మాట్లాడే భాషని సంస్కరిస్తే సంస్కృతం అయింది. భరతవర్షానికి అవతల కూడా దాదాపు సంస్కృతంలాగే ఉండే భాషలు ఒకటి రెండు చలామణిలో ఉండేవి. మీకు అర్థం కావాలని తెలుగులోకి తర్జుమా ఔతోంది”
“…””
“కోటలో చాలా పెద్ద ప్రయోగశాల వుంది. అందులో నన్ను ప్రయోగాలు చేసుకొమ్మన్నాడు. అప్పట్లో రాచనగరు నిర్మాణం ఒక క్రమపద్ధతిలో వుండేది. బాహ్యప్రాకారం. ఇందులో సామాన్యప్రజలుండేవారు. సాధారణ వ్యాపారకార్యకలాపాలు జరిగేవి. అంటే సంతలూ, దైనందిన జీవితానికి సంబంధించిన వ్యవహారాలూ వుండేవి. దాని లోపలి ప్రాకారంలో రాచోద్యోగులు, ఆ తరువాతి ప్రాకారంలో రాచప్రముఖులు నివాసం వుండేవారు. వారివారి స్థాయికి తగ్గట్టుగా ఇళ్ళుండేవి. తరువాతిది కోట. రాచగృహం వుండేది. సభ, అంత:పురం మొదలైనవి ఇందులో భాగం. రాజు చెప్పిన ప్రయోగశాలకూడా ఇక్కడే వుండేది. జనావాసాల కేంద్రస్థానంలో నన్ను అణుప్రయోగాలు చేసుకొమ్మన్నాడు””
“గాడ్!””
“అలా కుదరదనీ, నేను చేసే ప్రయోగాలు అత్యంత ప్రమాదకరమైనవనీ చెప్పాను. అప్పుడు యోధపురానికి మూడు కిలోమీటర్ల పశ్చిమాన మరో ప్రయోగశాల నిర్మాణం కట్టించాడు. ఆ నిర్మాణం నా సూచనలమేరకి జరిగింది””
“అణుప్రయోగాలంటే రియాక్టర్లవీ వుండేవా?””
“ఆనందమోహనా! సైన్సెప్పుడూ ఒకటే. పాత్ర మారినంతమాత్రాన పాత్రలో వున్న నీరు మారదుకదా? పరికరాల్లో కొద్ది మార్పు వుండచ్చు, సూత్రాలు అవే. పరమాణువుని చిట్లగొట్టడం. నాకు కొందరు సహాయకులు కావాలని అడిగాను. వచ్చారు. నా ప్రయోగశాలచుట్టూ చీమ దూరటానికికూడా వీలులేనంత నిఘా. ఇదంతా ఎందుకని అడిగాను రాజుని. అప్పటికి అతను నా ప్రయోగాలకిగల ప్రాముఖ్యతవలన పూర్తిగా నా ప్రభావంలోకి వచ్చేసాడు. చాలా చనువిచ్చాడు. ఆప్తమితృడినన్నాడు. ఆంతరంగికులలో అగ్రస్థానం ఇచ్చాడు”
“ఏమన్నాడు?””
“విదేశీ గూడచారులనుంచీ నాకు రక్షణ అన్నాడు. కానీ వాస్తవేమిటంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోకూడా నేను తప్పించుకు పారిపోకుండా వుండేందుకు. విదేశీయులకి నా సాంకేతికతని అమ్ముకోకుండా వుండేందుకు. ఆ సాంకేతికత సాయంతో నేను తిరుగుబాటు చెయ్యకుండా వుండేందుకు. ఒకరకంగా అతనికి మేము బందీలమన్నమాట””
“అంతేకదా, మరి? ఈజిప్టులో పిరమిడ్లని వున్నాయి. వాటిని నిర్మించిన శిల్పులని పిరమిడ్ మూతపడగానే చంపేసేవారట””
“శాస్త్రవేత్తలం ఒకరినొకరు సలహా సంప్రతింపులు చేసుకునేందుకు కోటలోని ప్రయోగశాలకూడా మా రహస్యస్థావరంలోకి తీసుకొచ్చారు. ఎవరి ప్రయోగాలు వాళ్ళవి. ఐతే తన ప్రయోగం ముగిసిందని ప్రకటించిన ఏ శాస్త్రవేత్తా మళ్ళీ కనిపించేవాడుకాదు. అతడలా ఫలితాన్ని రాజుకి తెలియపరచగానే గౌరవమర్యాదలతో అతడిని తీసుకెళ్ళేవారు. ఆ తర్వాత…”” మృత్యుంజయుడు ఆగాడు. అతని ముఖంలో విషాదం వ్యక్తమైంది. ఆమో, ధన్య తరువాతి సమాచారంకోసం ఆతృతగాచూసారు.
“వాళ్ళ ప్రయోగాల వివరాలన్నీ తెలుసుకుని, వాళ్ళని చెరసాలలో వేయించడమో, చంపెయ్యడమో చేయించేవాడు. సాధారణంగా విందు ఇచ్చి విషప్రయోగంతో చంపించేవాడు””
“అలాకూడా జరుగుతుందా? ప్రజాస్వామ్యవ్యవస్థ రాచరికంకన్నా గొప్పది అలాగైతే”” అంది ధన్య. ఆమె మనసు వికలమైంది.
“ఇంకొకటికూడా జరిగేది. మేము ఆచార్యులుగా చేరటానికి వచ్చినప్పుడు మా వివరాలన్నీ దాపరికంలేకుండా చెప్పేవాళ్ళంకదా, మా కుటుంబాలని రాచమర్యాదలతో పిలిపించుకునేవాడు. నా తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఎక్కడుండాలనేది నేను నిర్ణయించుకోవాలి. కానీ రాజే నిర్ణయించేవాడు” “
“మీకు పెళ్ళైందా? భార్యా పిల్లలు, తల్లిదండ్రులు…””
“పెళ్ళైంది. ఒక కొడుకుకూడా. తల్లిదండ్రులకి నేనొక్కడినే కొడుకుని. అందుకని వాళ్ళు నాదగ్గిరే వుండేవారు. అందర్నీ తీసుకొచ్చాడు. నాకొక అద్భుతమైన, అన్ని సదుపాయాలూ వున్న గృహాన్ని బహుకరించాడు. సంఘటనలు జరుగుతున్నప్పుడు మనకేం అర్థం కావుకదా? నేను వాళ్ళందర్నీ చూసి సంభ్రమాశ్చర్యాలకి గురయ్యాను. కొడుకు పసివాడు. భార్య చిన్నది. రాజుకి ఎంతో కృతజ్ఞతలు చెప్పాను. అలాగ నా కుటుంబం మొత్తం రాజుదగ్గిర బందీ ఐపోయింది””
“పాతకాలంనాటి తెలుగు సినిమా చూస్తున్నట్టుంది. ఏవేనా సాంకేతిక రహస్యాలు కనిపెడితే శాస్త్రవేత్తలని ఎత్తుకుపోతుంటారు”” అంది ధన్య.
“సినిమా అంటే?”” అడిగాడు మృత్యుంజయుడు.
“చలనచిత్రం. అంటే మీరు నాటకాలూ, యక్షగానాలవీ వేస్తారుకదా, అలాంటివే. ఐతే ఇందులో మనుషులుండరు. వాళ్ళెప్పుడో నటిస్తే ఆ చాయాచిత్రాలని రికార్డుచేసుకుని మనం ఎప్పుడేనా చూసుకోవచ్చు. అంతర్జాలంలో అలాంటివి లక్షలూ కోట్లూ వున్నాయి”” ఆమో వివరించాడు. అంతర్జాలం వుంటే అప్పటికప్పుడు మృత్యుంజయుడికి చూపించాలనికూడా అనిపించింది.
“ఓహో! భారతయుద్ధాన్ని సభలో కూర్చుని సంజయుడు చూసి వివరిస్తుంటే ధృతరాష్ట్రుడు విన్నట్టా? అప్పుడు మాయాదర్పణాలుండేవి”” అన్నాడు మృత్యుంజయుడు.
“లైవ్ టెలికాస్ట్ అని వప్పుకోవాలి”” అంది ధన్య.
ఆమో నవ్వాడు. వాళ్ళిద్దరూ మధ్యలో అలా ఒకరినొకరు చూసుకోవడం, నవ్వించుకోవడం మృత్యుంజయుడి దృష్టిని దాటిపోలేదు. ముఖ్యంగా ధన్య. కళ్ళనిండా ప్రేమని నింపుకుని అతను తనని చూడనప్పుడు చూస్తుంది. అతను తనవైపు చూపు తిప్పగానే ప్రొఫెషనల్‍గా మారిపోవటానికి ప్రయత్నిస్తుంది. ఆమోకూడా అంతే. చక్కటి జంట అని ముచ్చటపడ్డాడు. వాళ్ళ మనసుల్లో ఒక చిన్న స్పర్థ వుందనికూడా అర్థమైంది. ఆమోకి వచ్చే కలే ఆ స్పర్థ అని గ్రహించాడు. దాన్ని తీరిస్తే వాళ్ళు ఏకమౌతారనుకున్నాడు.
తన భార్యాపిల్లలు గుర్తొచ్చారు. మనసు ఆర్ద్రమైంది. తల్లిదండ్రులు గుర్తొచ్చారు. కోడలూ, మనవడికోసం వాళ్ళు చేసిన త్యాగం గుర్తొచ్చింది. వాళ్ళపట్ల కృతజ్ఞతతో మనసు నిండిపోయింది.
ఆమో ధన్యలకికూడా అతని భావాలు చేరుతున్నాయిగానీ అతని గురించీ ఏమీ తెలీదుగాబట్టి వుద్వేగాలు అర్థమవటంలేదు. అంటే వీళ్ళు తలుచుకున్నట్టుగా అతను జరిగిన సంఘటనలని పదేపదే తలుచుకొవటంలేదు. వీళ్ళది కొత్త గాయం. అతనిది చాలా పాతది. అవి గుర్తొచ్చి మనసుని వికలం చేస్తున్నప్పుడు అతడు ట్రాన్స్మిటర్ తీసేస్తున్నాడు. అది చూసి వాళ్ళుకూడా అలాగే చేస్తున్నారు. మరీ వ్యక్తిగత వివరాలు తెలీనివ్వడంలేదు. అలా తెలీడంవలన ప్రమాదం ఏమీలేకపోయినా అదొక మానవసహజమైన సంకోచం. దాన్ని మృత్యుంజయుడుకూడా గౌరవించాడు.
“రోజంతా ప్రయోగాలు. రోజులో ఎప్పుడో ఒకప్పటికి ఇంటికి రావటం, అలసిపోయి వచ్చిన నాకు ఇంట్లో ఆప్తులంతా కనిపించడం, రాచప్రాపకం… అందరూ చాలా సంతోషంగా వున్నాము. నా ప్రయోగాలు ఒక కొలిక్కి వచ్చాయి”
“అణు విచ్ఛేదనాన్ని ఎలా సాధించారు?”” ఆమో కుతూహలంగా అడిగాడు.
“ప్రయోగాలపేరుతో నిద్రాణంగా వున్న ప్రకృతిశక్తులని…అంటే భౌతిక, రసాయన శక్తులని నిద్రలేపడమే విజ్ఞానశాస్త్రమంటే. మన నిత్యం వాడుకునే ఇనుము, బంగారంలాంటివి కాకుండా ఇంకొన్ని ధాతువులుకూడా వుంటాయి… అఖిల, ధ్వంసిని, నాశకి, కరాళ, కంకాళ… ఇలా వుంటాయి వాటి పేర్లు. వాటిదగ్గిరకి మామూలుగా వెళ్తే పుట్టకురుపులు లేస్తాయి. అలాంటివాటిల్లో ఒకదాన్ని ఎంచుకుని…””
“అంటే యురేనియమా?” ” అడిగింది ధన్య.
“కావచ్చు. పుట్టకురుపంటే కేన్సరు. కణవిభజన అపక్రమంగా జరిగి, ఉండాల్సినదానికన్నా ఎక్కువగా బతికున్న కణాలు ఒకచోట పోగుపడి వుంటాయికాబట్టి అలా అంటారు. రాజయక్ష్మ అంటే ఎయ్‍డ్స్‌ట”” ఆమో వివరించాడు.
“ఇవన్నీ అప్పుడూ వుండేవా?” ” ఆశ్చర్యపోయింది ధన్య.
“ఈ మూలకాల్లోని పరమాణూవులు నిరంతరం అప్రమేయంగానే అణుచర్యలు జరుపుతుంటాయి. శక్తిని విడుదలచేస్తాయి. అలాంటి ధాతువుని ప్రేరేపించాను. అణువిచ్ఛేదనం జరిగింది. అపారమైన శక్తి విడుదలైంది. అలా నా ప్రయోగం సఫలమవ్వగానే నా జట్టులోని కొందరు శాస్త్రవేత్తలు… నాకు సహాయకులుగా వున్నవాళ్ళు అదృశ్యమయ్యారు”
“మరి మీరు? తప్పించుకున్నారా?”” ఆతృతగా అడిగింది ధన్య. ఆమె కళ్ళు బాధతో రెపరెపలాడాయి.
“ఒక గమ్మత్తు జరిగింది. ఒక విద్యుదయస్కాంత క్షేత్రం వున్న వాహకగుళిక””
“అదేమిటో మాకర్థమయ్యేలా చెప్పండి”” అన్నాడు ఆమో.
మృత్యుంజయుడు తన దగ్గిరున్న దర్పణంలో వెతికాడు. కాప్స్యూల్ అనే అర్థం దొరికింది. దాన్నెలా పలకాలో అతనికి తెలీలేదు. ఇంగ్లీషు అతనికి కొరుకుడు పడని భాష. ఒకే ’సీ’ని కేల్షియమ్ అన్న పదంలో రెండురకాలుగా పలికే భాష అది. ఆమోకి చూపించాడు. దర్పణం అనే వస్తువు అందమైన ఫ్రేంలో బిగించబడి అచ్చం అద్దంలాగే వున్న ఒక సెల్‍ఫోన్‍లాంటిది.
“తరువాతేమైందో చెప్పండి”” అన్నాడు ఆమో.
“అందులో విరుద్ధపదార్ధం తయారై పోగుపడింది. ఆ గుళిక వున్న లోహస్థూపం మిగతా పరికరాలన్నిటికీ భిన్నంగా ప్రవర్తించడంతో దగ్గిరకి వెళ్ళబోయాను. అది నన్ను ఈడ్చి కొట్టింది. స్పృహ వచ్చేసరికి రెండు సంవత్సరాల గతంలో వున్నాను”
వింటున్న ఇద్దరూ దిగ్భ్రాంతులయ్యారు. విరుద్ధపదార్ధం… టైం హంట్… అదీ యాదృశ్చికంగా…
“ఉన్నట్టుండి కనిపించకపోయేసరికి సర్వవీక్షణుడు నేను తప్పించుకు పారిపోయాననుకున్నాడు. నా కుటుంబసభ్యులందర్నీ, పసివాడైన నా కొడుకుతోసహా చెరసాలలో వేయించాడు. నేనెక్కడికి వెళ్ళానో చెప్పమని వాళ్ళని నిర్బంధించేవాడు. హింసించేవాడు. నా భార్య, కొడుకు తినవలసిన కొరడాదెబ్బలన్నీ నా తల్లిదండ్రులు తమకి బదలాయించుకున్నారు”
“మీరు తప్పించుకుపోయారని వాళ్ళు నమ్మారా?””
“మీకు నిజం చెప్పాలని లేదు”
“ఎందుకు?””
“కొన్ని నిజాలు తెలియకపోతేనే బావుంటుంది””
“అంటే నమ్మారా?””
మృత్యుంజయుడు మాట్లాడలేదు. అతను నోటితో చెప్పని నిజం, వాళ్ళకై వాళ్ళిద్దరూ గ్రహించిన నిజం అతన్ని నిప్పులా దహించింది.


అప్రమేయంగా గతంలోకి తప్పిపోయిన ఆ రెండు సంవత్సరాలూ మృత్యుంజయుడి జీవితంలో చాలా కీలకమైనవి.
అతడు తప్పించుకుపోయాడని తల్లిదండ్రులు, భార్య నమ్మారు. ఇంత స్వార్థపరుడైన కొడుకుని కన్నందుకు చాలా కుమిలిపోయారు. వృద్ధులైన తమగురించి కాకపోయినా కనీసం భార్యాకొడుకులగురించికూడా ఆలోచించని అతని స్వార్థబుద్ధికి అసహ్యించుకున్నారు. అలాంటి వ్యక్తిని మంచివాడిగా నమ్మించి పెళ్ళిచేసి గొంతుకోసినందుకు కోడలికి క్షమార్పణ చెప్పుకున్నారు. ఆమె వంతు దెబ్బలన్నీ తాము తిన్నారు.
అతడు మళ్ళీ వర్తమానంలోకి వచ్చేసరికి చాలా మార్పులు జరిగాయి. అణువిచ్చేదనాన్ని సాధించిన శాస్త్రవేత్తలని నిర్బంధించి వారిచేత రణగోళాలని తయారు చేయించి వాటిని యుద్ధంలో ప్రయోగించాడు సర్వవీక్షణుడు. చాలా విధ్వంసం జరిగింది. అతడు అణుప్రయోగం చేసినచోటల్లా సముద్రమట్టాలు పెరిగి నగరాలకి నగరాలే నీటమునిగాయి. అందులో మృత్యుంజయుడు వుదహరించిన కొన్ని నగరాలున్నాయి.
అతడు తిరిగి వచ్చిన వార్త తక్షణం రాజుకి చేరిపోయింది. వెంటనే రమ్మని పిలిపించాడు.
“ఏమైపోయావు ఇన్నాళ్ళూ? నువ్వు కనిపెట్టిన రహస్యాలని ఏ దేశానికి అమ్మేశావు ? అలా చేసే ముందు నీ కుటుంబం నా దగ్గర ఉందన్న విషయంకూడా నువ్వు ఆలోచించవా? రాజద్రోహంచేసి నా ముందుకి రావడానికి ఎంత ధైర్యం నీకు?”” చాలా క్రూరంగా అడిగాడు.
అప్పటికి బయట జరిగిన సంఘటనలేవీ మృత్యుంజయుడికి తెలియవు. అతడు ప్రయోగశాలలోంచీ గతంలోకి వెళ్ళాడు. గతంలోని ఆ ప్రదేశం అతడికి అపరిచితమైనది. ఆ కాలం పూర్తయ్యాక అదే జీవితాన్ని గడిపి మళ్ళీ ప్రయోగశాలలోకి వచ్చాడు. తన కుటుంబాన్నిగురించి ఎలాంటి నిజాలూ తెలీవు . వాళ్ళకేదో జరిగివుండచ్చన్న అనుమానంకూడా లేదు.
“నేను ఎక్కడికో వెళ్లడం ఏమిటి? నా ప్రయోగాలు ఇంకా ముగియలేదు. ప్రయోగశాలలో తయారైన ఒక విషమపదార్థం నన్ను గతంలోకి తోసేసింది. నేను రెండు సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయాను. ఆ కాలాన్ని గడిపి తిరిగొస్తున్నాను”” అన్నాడు అయోమయంగా.
“కాలంలో ప్రయాణించావా? గతంలోకి?”” హేళనగా, అపనమ్మకంగా అడిగాడు.
“నేను చెప్తున్నది నిజం. కావాలంటే నాతో ప్రయోగశాలకి రండి”” అన్నాడు.
రాజు ఒక్కడే రాలేదు. అవసరమైతే అతడిని బంధించడానికి భటులని వెంటబెట్టుకుని వచ్చాడు. అతడి మాటలో ఒక కర్కశత్వం. వెనకటి నమ్మకం, స్నేహం, సౌహార్ద్రత అన్నీ మాయమయ్యాయి. అప్పుడు అనుమానం మొదలైంది మృత్యుంజయుడికి రాజుమీద. రాగానే అతనన్న మాటలకి అర్థం ఏమిటి? ఏం జరిగి ఉంటుందో వూహకి అందటంలేదు.
ప్రయోగశాలలో విరుద్ధపదార్థం పోగుపడి ఉన్న లోహస్థూపాన్ని చూపించాడు.
“ఏమిటిది? లోహస్తూపం… “హేళనగా అంటూ దాని దగ్గరికి వెళ్లబోయాడు. మృత్యుంజయుడు ఆపాడు. అలా ఆపడం అనేది ఒక అసంకల్పిత చర్య. ఆపకుండా వుండాల్సిందని తరువాత పశ్చాత్తాపపడ్డాడు.
“ఏం జరుగుతుంది, దాని దగ్గిరకి వెళ్తే? అదేనా నిన్ను గతంలోకి తోసుకెళ్ళింది?”” అడుగుతూ మృత్యుంజయుడు చెప్పేంతలో ఒక భటుడిని దానిమీదకు తోసాడు. అతడు అమాంతంగా మాయమయ్యాడు. రాజు కళ్ళలో ఆశ్చర్యం. దాన్ని పట్టలేక పెద్దగా నవ్వాడు. వట్టి నవ్వు కాదది. వికటాట్టహాసం. అతని నిజరూపాన్ని ప్రదర్శించింది.
తర్వాత ఇంకొకడు… ఇంకొకడు… అలా తోస్తూనే ఉన్నాడు. చుట్టూ వున్న భటుల్లో కలకలం. ఆ స్తూపంమీద పడ్డవాళ్ళు ఏమౌతున్నారని ఆలోచించటం లేదు వాళ్ళు. తర్వాత తమ వంతేమోనని భయపడుతున్నారు. భయం వాళ్ళలో ఎవర్నీ కాపాడలేదు. అందర్నీ గతంలోకి నెట్టేసి తృప్తిగా చూసి, మృత్యుంజయుడివైపు తిరిగి-
“నువ్వు పారిపోయావనుకున్నానులే. నీ భార్యనీ తల్లిదండ్రులనీ ఎంత అడిగినా వాళ్ళకి తెలీదన్నారుతప్ప నీ ఆచూకీ చెప్పలేదు””
“తమకి తెలీని విషయం వాళ్ళెలా చెప్పగలరు? “”
“వాళ్ళకి నీగురించి తెలీదన్న విషయం నాకు తెలీదుకదా? నిజం చెప్పించేందుకు రోజూ కొరడాదెబ్బలు కొట్టించేవాడిని. నీ భార్యా కొడుకూ తినాల్సిన దెబ్బలు ముసలాళ్ళిద్దరూ తిన్నారు. తట్టుకోలేక చచ్చారు. నీలాంటి నమ్మకద్రోహికి భార్యగా వుండటానికి బదులు నా అంత:పురంలోకి వచ్చెయ్యమన్నాను నీ భార్యని. వినలేదు. చంపి అవతల పారేసాను”” నిర్లక్ష్యంగా అన్నాడు. ఆ క్షణాన తనకి కలిగింది కోపమా, బాధా, పశ్చాత్తాపమా అనేది ఇన్ని వేలయేళ్ళ తర్వాతకూడా అర్థం కాలేదు మృత్యుంజయుడికి.
“నా కొడుకు?”” తన గొంతు తనకే కీచుగా వినిపించింది.
“అంతా పోయాక వాడెందుకింక? పసికుంక. ఎవడు పెంచాలి వాడిని?””
“ఎవరూ ఏ తప్పూ చెయ్యకపోయినా అందర్నీ చంపేసారా?”” జీర్ణించుకోలేక అడిగాడు.
జవాబు మృత్యుంజయుడికి అవసరంలేదు. రాజుని ఈడ్చుకెళ్ళి స్థూపం మీదకి తోసెయ్యాలనుకున్నాడు. చాలా వుద్రేకం కలిగింది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా విచక్షణ పనిచేసింది. అతడిని ఆపింది.
రాజు క్షత్రియుడు. మద్యమాంసాలు, నిరంతర వ్యాయామంతో దృఢంగా పెరిగిన శరీరం అతడిది. తామిద్దరికీ జరిగే పెనుగులాటలో తననే అతడు స్తూపంమీదికి తోసెయ్యవచ్చు… చాలా సునాయాసంగా. అప్పుడేం జరుగుతుంది? కనిపెట్టిన ప్రయోగఫలం అతనిచేతిలో పడుతుంది. పిచ్చివాడి చేతిలో రాయిలాంటిదౌతుంది. అతనిష్టం వచ్చినట్టు వాడుకుంటాడు. అది వినాశనానికేగానీ మంచికి కాదు. నిగ్రహించుకున్నాడు.
“సరే, జరిగిందేదో జరిగింది. నేను పొరపాటున ఆ స్థూపాన్ని తాకాను. ఎవరికీ చెప్పగలిగే అవకాశం లేకపోయింది. నేను ఎక్కడికి వెళ్ళానో తెలీదు కాబట్టి మీరలా అనుకోవడంలో తప్పులేదు. ఇలా స్థూపంమీద పడటం ఎక్కడికి వెళ్లామో తెలియకుండా మాయమవటం మళ్ళీ అంతకాలం గడిపి తిరిగిరావటం కాదు. ఖచ్చితంగా ఒక కాలంలోకి వెళ్లాలి. మళ్లీ వెంటనే తిరిగి రాగలగాలి. అలాంటి యంత్రాన్ని నేను తయారు చేస్తాను. నాకు కావలసిన పరికరాలు సమకూర్చండి”” మనసు చంపుకుని అన్నాడు. ఆ క్షణాన అతను కోరుకున్నది అలాంటి యంత్రాన్ని కనిపెట్టి, గతంలోకి వెళ్లి భార్యా పిల్లల్ని, తల్లిదండ్రుల్ని తీసుకుని వర్తమానాన్ని దాటేసి భవిష్యత్తులోకి పారిపోవడం.
మృత్యుంజయుడి మాటలకి రాజు చాలా ప్రభావితుడయ్యాడు. తనవాళ్లందర్నీ చంపేసినందుకు అతడుగానీ ఎదురుతిరిగితే ఏదో చేయాలనుకున్న వ్యక్తి అతడు చేసే ప్రయోగాలకోసం మంత్రించిన కుక్కపిల్లలా మారిపోయాడంటే అతిశయోక్తి కాదు. అయితే అతను మృత్యుంజయుడికన్నా చాలా తెలివైనవాడు. అతడి మనసులోని ఆలోచనలు పసిగట్టినట్టే పారిపోకుండా గట్టి ఏర్పాట్లు చేసుకున్నాడు. మొదటిది అతడిని గొలుసులతో బంధించడం. ప్రయోగశాల కాపలాని మరింత కట్టుదిట్టం చెయ్యడం.
“మొదటిసారి జరిగినలాంటి పొరపాటు మళ్లీ జరక్కుండా ఈ ఏర్పాట్లు”” అన్నాడు సముదాయిస్తూ. నిజమే కావచ్చు. ఈ గొలుసులు మృత్యుంజయుడిని పట్టి ఉంచుతాయని అతని నమ్మకం.
“నీకు చాలా నష్టం జరిగింది. చక్కటి చుక్కల్లాంటి అమ్మాయిలని నీ ముందు నిలబెడతాను. ఎవరైనా నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు. నేనే జరిపిస్తాను” అన్నాడు. మృత్యుంజయుడి గుండె మండింది. ఆ మంటలో బాధని కాల్చి నుసి చేసి ఆశని మాత్రమే మిగుల్చుకున్నాడు.
“ముందు నా ప్రయోగం పూర్తవ్వాలి”” అన్నాడు. రాజు దానికి సమ్మతించాడు.
నిరంతర నిఘా మధ్య ప్రయోగాలు మొదలయ్యాయి. స్థూపం దగ్గరికి వెళ్తే అది గతంలోకి విసిరి కొడుతుంది. ఒక గగననౌక కావాలని అడిగాడు. అది వచ్చింది. అందులో ఈ స్థూపాన్ని చేర్చాలి. ఆ చేర్చే ప్రక్రియలో తను కాలంలో తప్పిపోకూడదు. కాలంలో ప్రయాణం చేసే విషయంలో ఈ గొలుసులు ఆపుతాయని అనుకోవట్లేదు.