Invite and Terms

  • రచనలకు ఆహ్వానం.
  • కథ, నవల, పుస్తకసమీక్ష, అనువాదం అనే ప్రక్రియలను వెబ్‍సైట్ ప్రోత్సహిస్తుంది. పాఠకులు కథ, పుస్తకసమీక్ష, అనువాదకథలు వుచితంగా చదవవచ్చు. నవలలకు వాటిపై వున్న వెల చెల్లించవలసి వుంటుంది.
  • రచయితలు రచనను పంపేముందు వారి వివరాలను వెబ్‍సైట్‍లో రిజిస్టర్ చేసుకోవాలి.
  • రచన వారి స్వంతమై వుండాలి. అలాకాని పక్షంలో తలెత్తే వివాదాలతో వెబ్‍సైట్‍‍కు సంబంధం లేదు. ఆయా కాపీ రచయితలే బాధ్యులు. అన్ని ప్రక్రియల్లోని రచనలకూ కాపీరైట్స్ వర్తిస్తాయి.
  • రచయితలు తమ రచనలకి వాడే మీడియా కాపీరైట్ లేని ఇమేజెస్ మాత్రమే వాడాలి. లేదా లైసెన్స్ పొంది వుండాలి. ఆ విషయం స్పష్టంగా తెలియజేయవలసి వుంటుంది. ఎటువంటి కాపీరైట్ సమస్యలకూ వెబ్ సైటు బాధ్యత వహించదు. ఆయా రచయితలే పరిష్కరించుకోవాలి.
  • రచనల్లో శృంగారం, హింస, క్రౌర్యంవంటివాటికి చోటు లేదు.
  • కథలు నిడివిలో 500-5000 పదాలు వుండవచ్చు. ఆ నిడివి దాటినా, సీరీస్‍గా వ్రాసినా అవి నవలలుగా తీసుకోబడతాయి. అనువాద రచనలకుకూడా ఇదే నియమం వర్తిస్తుంది.
  • నవలల అమ్మకంలో 60% వెబ్‍సైటుకు, 40% రచయితకు చెందుతుంది.
  • కథలకు ఇంకా ఎటువంటి పారితోషికం నిర్ణయించబడలేదు. త్వరలో ఈ విషయంలో నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. పుస్తకసమీక్షలకు, అనువాదకథలకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. నెలకు 10 రచనలు తీసుకోవటం జరుగుతుంది.
  • కొత్త కథలతోపాటు ఇప్పటికే సోషల్‍మీడియాలో వున్న కథలనుకూడా పంపవచ్చు.
  • పుస్తక సమీక్షలు నిడివిలో 500-2000 పదాలు వుండవచ్చు. ఏ భాషలోని పుస్తకాన్నేనా సమీక్షించవచ్చు.
  • ప్రతి అనువాదరచనకూ మూల రచయిత, లేదా కాపీరైటు హక్కు కలిగి వున్నవారి లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. పబ్లిక్ డొమెయిన్‍లో వున్న పుస్తకాలకు ఎలాంటి అనుమతీ అవసరం లేదు.
  • ఇంకా ఏవైనా సందేహాలుంటే కాంటాక్ట్ పేజి ద్వారా సంప్రదించగలరు.
  • ఈ నియమ నిబంధనలు అవసరాన్నిబట్టి మార్పులు, చేర్పులు చేయబడతాయి.
  • రచనలు Post submission form ద్వారా పంపవలసి వుంటుంది.

Scroll to Top