అలా అర్థమైందా? by Pathy Muralidhara Sharma

  1. ఫ్రిజ్ లోకి ఏం వండనూ!!! by Savitri Ramanarao
  2. ఆధునిక కవితోపాఖ్యానం by Savitri Ramanarao
  3. దానం కొద్దీ…! by Nandu Kusinerla
  4. కర్మణ్యేవాధికారస్తే!!!… by Savitri Ramanarao
  5. బలిపశువు by Pathy Muralidhara Sharma
  6. వైద్యంలో వేద్యం by Savitri Ramanarao
  7. నేనూ మనిషినే by Pathy Muralidhara Sharma
  8. చిన్న కుటుంబ చిత్రం by Savitri Ramanarao
  9. ఒక్క క్షణం by Pathy Muralidhara Sharma
  10. ఎందుకు రాదూ!! By Savitri Ramanarao
  11. యద్భావం తద్భవతి by Pathy Muralidhara Sharma
  12. అలా అర్థమైందా? by Pathy Muralidhara Sharma
  13. మనసు మూయకు!!! by Savitri Ramanarao
  14. ఎవరికెవరు ఏమవుతారో! by Pathy Muralidhara Sharma
  15. కాస్త సహనం వహిస్తే by Savitri Ramanarao
  16. అమ్మ దయ ఉంటే… by Savitri Ramanarao
  17. మై హుం నా బెహన్! by Savitri Ramanarao

” ఆనందరావుగారూ మీరేమీ అనుకోనంటే ఓ విషయం అడుగుతాను చెప్తారా ? ” అడిగేడు నన్ను మా ఆఫీసులో క్లర్క్ కామేశ్వరరావు.
” అనుకునేదేముందండీ, నాకు తెలిసిందయితే తప్పకుండా చెప్తాను ” అన్నాను.
” మన ఆఫీసులో అంతా పిచ్చాపాటీగా ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. కాని మీరు మాత్రం కనీసం లంచ్ అవర్‍లో కూడా నోరు విప్పడం చూడలేదు. ఆ కుమార్‍గారిని చూడండి ఆయన మాట్లాడని విషయమంటూ లేదు కాలిజోడు నుండి కంట్రీ బోర్డర్ వరకూ “
” ఒకరి విషయం నాకనవసరమండీ . నా ఉద్దేశ్యంలో దేనిలోనూ అతి మంచిది కాదు ” అన్నాను. కాని నా అభిప్రాయం కామేశ్వరరావుకు అంత రుచించినట్లు లేదు. ఇంతలో మా బాస్‍నుండి నాకు పిలుపు రావడంతో ఆ ప్రసక్తి అంతటితో ఆగిపోయింది .
ఓరోజు కామేశ్వరరావు హడావిడిగా నా దగ్గరకు వఛ్చి ” ఆనందరావుగారూ ఇది విన్నారా, కుమార్‍గారిని కడప ట్రాన్సఫర్ చేసేరట బాసు ” అని చెప్పేడు
” ఏమట ?” ముక్తసరిగా అడిగేను సహజధోరణిలో .


” ఎప్పుడు చూసినా ఎవరితో ఒకరితో ఏదో ఒకటి మాట్లాడుతూ తను పని చేయకపోవడమే కాకుండా అవతలి వాళ్ళనుకూడా పనిచెయ్యనివ్వకుండా అందర్నీ డిస్టర్బ్ చేయడం బాస్ దృష్టిలో చాలాసార్లు పడిందట” చెప్పేడు
” నేను చెప్పేను కదండీ . అతి సర్వత్ర వర్జయేత్ అని ” అన్నాను.
ఈసారి నాతో ఏకీభవించినట్లున్నాడు ” నిజమే సుమండీ! కానీ ఆ లెక్కన మీరు కూడా అతిమితంగా మాట్లాడుతున్నారేమో ” అన్నాడు .
” ఓ మీకలా అర్థమయిందా అయితే అమితంగా మాట్లాడనా ?” అన్నాను
” వద్దు వద్దు అమృతంలా మాట్లాడండి చాలు” అన్నాడు.
( ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో 22.7.1988 ప్రసారితమైంది.)