Vanaja Tatineni

వ్యవసాయ నేపథ్యం కల కుటుంబంలో జన్మించారు.
గృహిణి.
దూరవిద్య ద్వారా గ్రాడ్యుయేట్ పూర్తి చేసారు. కవిత్వం పట్ల మక్కువతో రచనా వ్యాసంగంలో ప్రవేశించారు. 100 పైగా కథలు, కవిత్వం అనేక సాహిత్య వ్యాసాలు వ్రాసారు.
రాయికి నోరొస్తే, కులవృక్షం కథాసంపుటాలు, “వెలుతురు బాకు” కవితా సంపుటి వెలువరించారు.  వీరి రచనలన్నీ
https://vanajavanamali.blogspot.com లో భద్రపరిచారు.  పిహెచ్ డి విద్యార్ధులు  కొందరు ఈమె రచనలపై అధ్యయనం జరిపి పత్ర సమర్పణ చేసారు. “ఇంటి పేరు” అనే కథకు గాను లాడ్లీ మీడియా అవార్డును అందుకున్నారు.