Somanchi Sridevi

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‍లో వుద్యోగం. హెడ్‍పోస్ట్‌మాస్టర్‍గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ. వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో.  వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు. మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి. కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.

ఉరి by S Sridevi

రోజూ రెండుమూడుసార్లయినా హాస్పిటల్ కి వెళ్లొస్తాడు కిషోర్, భార్య అనారోగ్యం అతనికి కొంచెం అసహనం కలిగిస్తోంది. పెళ్లయిన వెంటనే ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత డెలివరీ, ఈ అనారోగ్యం… జీవితంలో ఏమీ అనుభవించలేదనిపిస్తోంది అతనికి. ఆమెను పెళ్లి చేసుకుని తనేం సుఖపడ్డాడు? రావాల్సిన కట్నం రాలేదు. హాస్పిటల్ ఖర్చు తడిసి మోపెడవుతోంది. బాంక్‍బాలెన్స్ చాలా వరకూ. ఖర్చయిపోయింది.

ఉరి by S Sridevi Read More »

ప్రేయసి అందం by Sridevi Somanchi

అందుకే… అప్పట్నుంచీ వేలుపెట్టి కొనుక్కున్న నిరర్థకమైన వస్తువుని ఎలా పారెయ్యలేమో, అలా భరిస్తున్నాను ఇతన్ని” అంది వణుకుతున్న గొంతుతో.

ప్రేయసి అందం by Sridevi Somanchi Read More »

వెంటాడే జ్ఞాపకాలు by S Sridevi

“”ఇదంతా ఎందుకు?దేవుడు అక్కడెక్కడో అందంగా స్వర్గాన్ని నిర్మించుకుని హాయిగా వుంటున్నాడే అనుకుందాం. మనని రానిస్తాడంటావా? చుట్టూ వున్న ఈ చిన్ని ప్రదేశాన్నే అందంగానూ ఆహ్లాదంగానూ వుంచుకోలేని మనని ఎన్ని పూజలు చేసి ఎంత వేడుకున్నా కానీ? ఆయన స్వర్గం పాడైపోదూ?” అన్నాడు గొంతు తగ్గించి పరిహాసంగా.

వెంటాడే జ్ఞాపకాలు by S Sridevi Read More »

ఊదాపచ్చనౌక – 12 by S Sridevi

“రెండుసార్లు చావంటే ఏమిటో చూసివచ్చావు ధన్యా! ఇంకా అతన్తో పెళ్ళేమిటి? ఒక శాస్త్రవేత్తగా ఆమోపట్ల నాకు అపారమైన గౌరవం వుంది. గాంధీలు పక్కింట్లో పుడితే మనం చప్పట్లు కొట్టవచ్చుగానీ మనింట్లోనే పుట్టాలని కోరుకోకూడదు”అన్నాడు అబ్రహం.

ఊదాపచ్చనౌక – 12 by S Sridevi Read More »

ఊదాపచ్చనౌక – 11 by S Sridevi

తరువాతిది చెప్పలేక తల దించుకున్నాడు. అందులో సూచనాప్రాయంగా ఆయన అభిప్రాయం… తను దిగ్గున తలెత్తింది.
“ఔను. నువ్వనుకుంటున్నదే నిజం. అతన్ని అల్లునిగా చేసుకుని అందరి పరువూ నిలబెట్టబోతున్నాను””

ఊదాపచ్చనౌక – 11 by S Sridevi Read More »

ఊదాపచ్చనౌక – 10 by S Sridevi

“నేను రాజునీ మిమ్మల్నీ మోసం చేసి పారిపోలేదు. గతంలోకి వెళ్ళిపడ్డాను. నాకు తెలియనిచోట పూర్తి అపరిచితులమధ్య గడిపాను. మళ్ళీ వర్తమానాన్ని చేరుకోవచ్చన్న నమ్మకంతో అక్కడే వున్నాను. అలాగే వర్తమానాన్ని చేరుకున్నాను. అప్పటికి నేను వదిలిపెట్టిన వర్తమానానికి రెండేళ్ళు కలిసాయి. చాలా విధ్వంసం జరిగింది. నావలన మీరు చాలా కష్టాలు పడ్డారు”” అన్నాడు కన్నీళ్ళతో.
తాము పడ్డామన్న కష్టాలు వాళ్ళెవరికీ తెలీవు.

ఊదాపచ్చనౌక – 10 by S Sridevi Read More »

ఊదాపచ్చనౌక 9 by S Sridevi

“కాలంలో ప్రయాణించడానికి కొన్ని సిద్ధాంతాలున్నాయి”” అన్నాడు ఆమోతో.
“మేమింకా కాలంలో ప్రయాణించే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాం. అది అసాధ్యమనే ఇప్పటికీ నమ్ముతున్నారు చాలామంది” అన్నాడు ఆమో.

ఊదాపచ్చనౌక 9 by S Sridevi Read More »

ఊదాపచ్చనౌక – 8 by S Sridevi

“ఆనందమోహనా! సైన్సెప్పుడూ ఒకటే. పాత్ర మారినంతమాత్రాన పాత్రలో వున్న నీరు మారదుకదా? పరికరాల్లో కొద్ది మార్పు వుండచ్చు, సూత్రాలు అవే. పరమాణువుని చిట్లగొట్టడం.

ఊదాపచ్చనౌక – 8 by S Sridevi Read More »

ఊదాపచ్చనౌక – 7 by S Sridevi

“నమస్తే. నాపేరు మృత్యుంజయుడు. నేను మీరనుకుంటున్నట్టుగా గ్రహాంతరవాసిని కాదు. మనిషినే. భూగోళవాసినే”” అన్న మొదటి సమాచారం అందగానే ఆమో ఆశ్చర్యంగా చూసాడు.

ఊదాపచ్చనౌక – 7 by S Sridevi Read More »

Scroll to Top