Somanchi Sridevi

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‍లో వుద్యోగం. హెడ్‍పోస్ట్‌మాస్టర్‍గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ. వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో.  వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు. మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి. కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.

అపూర్వ రష్యన్ జానపదకథలు – స్వేచ్చానువాదం- అనిల్ బత్తుల

అపూర్వ రష్యన్ జానపదకథలు – స్వేచ్చానువాదం- అనిల్ బత్తుల- A review

అపూర్వ రష్యన్ జానపదకథలు – స్వేచ్చానువాదం- అనిల్ బత్తుల Read More »

గూడు by S Sridevi

ఎంత పెద్దదాన్నని? ఎమ్మెస్ సుబ్బలక్ష్మిని నీకా పాటలెందుకు, పెద్దదానివి అయ్యావు, ఓ మూల కూర్చోమని ఎవరైనా అన్నారా? అలాగే ఇందిరాగాంధీని అనగలిగారా? వీళ్లందరికంటే చిన్నదాన్నేగా?

గూడు by S Sridevi Read More »

అన్ హోనీ by S Sridevi

“ఆకేసి… పప్పేసి… కూరేసి… అన్నం పెట్టి… నెయ్యేసి…” చేతూ చిన్ని అరచేతితో ఆడుతున్న కళ్యాణికి హఠాత్తుగా గుండెల్లో ఏదో కదిలినట్టై ఆ బాధకి కళ్ళలో పల్చటి కన్నీటిపొర నిలిచింది. భర్తకి దొరకకూడదని గమ్ముని లేచి అక్కడినుంచి వెళ్ళిపోయింది-

అన్ హోనీ by S Sridevi Read More »

అస్తిత్వసంతకం by S Sridevi

“ఆర్యూ క్రేజీ?” మెయిల్ చూసి వెంటనే ఫోన్ చేసి దిగ్భ్రాంతిగా అడిగింది హెచార్ మేనేజర్ లాస్య.
“సరిగానే నిర్ణయిచుకున్నాను. ఒక సమయంలో అవసరాలన్నీ డబ్బుగా మారిపోయాయి. తర్వాత డబ్బు కాలంగా మారింది. ఇప్పుడు కాలాన్ని ప్రేమగా మార్చుకోకపోతే ఆ తర్వాత మార్చుకోవటానికి ఇంకేదీ వుండదు” అంది ప్రజ్ఞ.

అస్తిత్వసంతకం by S Sridevi Read More »

ఊహించని అతిథి by S Sridevi

కొన్ని సంభావ్యతలు సంఘటనలుగా మారినప్పుడు అవి ఎలాంటి భౌతికమైన ఆధారాలూ మిగల్చవు. భౌతికశాస్త్రసూత్రాలకి లోబడని ఈ సంఘటనలు మన జీవితంమీద మాత్రం కచ్చితమైన ముద్ర వేసి ఒక సందిగ్ధంలో పడేస్తాయి. జరిగింది నిజమా కాదా అని మనకే అనుమానం కలిగేలా.

ఊహించని అతిథి by S Sridevi Read More »

Scroll to Top