somanchi sridevi

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో జననం. వరంగల్‍లో వుద్యోగం. హెడ్‍పోస్ట్‌మాస్టర్‍గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ. మొదటి కథ "అనగనగా" 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ,తిరస్కృతులు, నీకోసం నేను అనేనవలలకి ఆంధ్రభూమి ద్వితీయ 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005కిగాను వచ్చింది. "ఎంతెంతదూరం?" అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.

ఝరి 61-70 by S Sridevi

“నువ్వు చాలా రిస్కు తీసుకున్నావు స్వప్నా! తీసుకెళ్ళింది సరైనవాళ్ళుగనుక సరిపోయిందిగానీ, లేకపోతే ఎన్ని చిక్కుల్లో పడేదానివో తెలుసా? ఇది లేడీస్ హాస్టల్. పోలీసులు, కేసుల్తో మాకూ చాలా సమస్యలు ఎదురయ్యేవి. టీవీలో వార్త చూసినప్పుడు వెంటనే నాకు ఫోన్ చేసి అలర్ట్ చెయ్యాల్సింది. మరొకరికి తెలీకుండా ఆమెని హాస్టల్‍నుంచీ వెళ్ళిపొమ్మనేదాన్ని.

ఝరి 61-70 by S Sridevi Read More »

గినీ పిగ్స్ by S Sridevi

“మాధవ్ కనిపించి వాళ్లింటికి తీసుకెళ్లాడు” అన్నాడు.
మాధవ్ స్వప్నకి బాగా తెలుసు. ఇంట్లో ఏది పద్ధతిగా లేకపోయినా అతన్ని ఉదాహరణగా చెప్తాడు చంద్రమోహన్.

గినీ పిగ్స్ by S Sridevi Read More »

తనువు, మనసు, ఆత్మ by S Sridevi

“స్వర్ణా! పెళ్లంటే ఇల్లంటే భార్యాభర్తలు ఏకాంతంగా గడిపే పడకగదితో పాటు సంఘజీవనాన్ని సూచించే వీధిగది కూడా ఉండాలని తెలియకనే ఇప్పటి పిల్లల పెళ్లిళ్లు ఇంత తొందరగా బ్రేకవుతున్నాయి.

తనువు, మనసు, ఆత్మ by S Sridevi Read More »

యుద్ధం ముగిశాక by S Sridevi

   “ఔను మీరా! మనిషిని మనిషి కించపరచుకుంటూ బతుకుతున్నాం మనం. స్త్రీలుగా, పురుషులుగా, కులాలుగా, మతాలుగా, వున్నవాళ్సుగా, లేనివాళ్ళుగా విడిపోయిన సమాజం మనది. అందుకే నీ పెళ్ళి ఆలస్యమైంది. అతను నీ విలువ గుర్తించి వచ్చాడు “

యుద్ధం ముగిశాక by S Sridevi Read More »

ఆకుపచ్చ నేలకోసం by స్వరాజ్య పద్మజ కుందుర్తి

ఈ రాజకీయపరిణామాలన్నీ ప్రజాజీవితాన్ని చాలా ప్రభావితం చేసాయి. ప్రజల్లో నీతి, నిబద్ధతలు తగ్గాయి. మూఢాచారాలు పెరిగాయి.

ఆకుపచ్చ నేలకోసం by స్వరాజ్య పద్మజ కుందుర్తి Read More »

Scroll to Top