Vanaja Tatineni

వ్యవసాయ నేపథ్యం కల కుటుంబంలో జన్మించారు. గృహిణి. దూరవిద్య ద్వారా గ్రాడ్యుయేట్ పూర్తి చేసారు. కవిత్వం పట్ల మక్కువతో రచనా వ్యాసంగంలో ప్రవేశించారు. 100 పైగా కథలు, కవిత్వం అనేక సాహిత్య వ్యాసాలు వ్రాసారు. రాయికి నోరొస్తే, కులవృక్షం కథాసంపుటాలు, “వెలుతురు బాకు” కవితా సంపుటి వెలువరించారు.  వీరి రచనలన్నీ https://vanajavanamali.blogspot.com లో భద్రపరిచారు.  పిహెచ్ డి విద్యార్ధులు  కొందరు ఈమె రచనలపై అధ్యయనం జరిపి పత్ర సమర్పణ చేసారు. “ఇంటి పేరు” అనే కథకు గాను లాడ్లీ మీడియా అవార్డును అందుకున్నారు.

గుండుసూది by Vanaja Tatineni

అభివృద్దికి ఆనవాలు అమరావతి హోరులో యిరవై యేళ్లుగా నాన్చుతున్న రోడ్డు విస్తరణ కార్యక్రమం నట్లు కొట్టుకుంటూ సాగుతూ వుండటం వల్ల .. విజయవాడ చివరన వున్న మేము కూడా ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోక తప్పడంలేదు. అనుకున్న చోటికి సరైన సమయానికి చేరుకోవాలంటే అడ్డదారులు వెతుక్కోవాల్సిన పరిస్థితి. గూగుల్ మ్యాప్ ని శరణు వేడితే మా ఇంటికి వాయువ్య మూలనుండి కేవలం రెండు పర్లాంగుల దూరం వెళితే చాలు సులభంగా IRR కి వెళ్ళే దారి చూపించింది.

గుండుసూది by Vanaja Tatineni Read More »

Scroll to Top