Stories

అన్ హోనీ by S Sridevi

“ఆకేసి… పప్పేసి… కూరేసి… అన్నం పెట్టి… నెయ్యేసి…” చేతూ చిన్ని అరచేతితో ఆడుతున్న కళ్యాణికి హఠాత్తుగా గుండెల్లో ఏదో కదిలినట్టై ఆ బాధకి కళ్ళలో పల్చటి కన్నీటిపొర నిలిచింది. భర్తకి దొరకకూడదని గమ్ముని లేచి అక్కడినుంచి వెళ్ళిపోయింది-

అన్ హోనీ by S Sridevi Read More »

ఫ్రిజ్ లోకి ఏం వండనూ!!! by Savitri Ramanarao

నా  వైపోసారి గుర్రుగా చూసి “అబ్బా! ఏమిటి మమ్మీ ? నీకు తోచిందే దో చెయ్యి.” అని  “కార్తీ!!” అని  గర్జిస్తూ టీవీ స్క్రీన్ మీద రెండు చేతులతో డోలు బజాయిస్తున్న మా నాలుగేళ్ళ మనవడి మీదకు బాహుబలి సినిమాలో ప్రభాస్ ఏనుగు మీదికి ఎగిరినట్లు ఎగిరి వాడిని రెక్కుచ్చుకు ఇవతలికి లాగి  టీవీ స్క్రీన్  మా మనవడి బారి పడకుండా రక్షించి రొప్పుతూ సోఫా మీద కూల బడింది మా అమ్మాయి విజయ.

ఫ్రిజ్ లోకి ఏం వండనూ!!! by Savitri Ramanarao Read More »

నీల by Nandu Kusinerla

నది దాటి అవతలి గట్టుకు చేరిన నీలకి ఒక వేప చెట్టు కనిపించింది. తరాలుగా పెరుగుతూ దిట్టంగా నిలబడిన కాండం. గుబురైన శాఖోపశాఖలతో కూడిన కొమ్మలతో  ఆకుపచ్చని  లోకంలాగా అగుపించింది.

నీల by Nandu Kusinerla Read More »

గుండుసూది by Vanaja Tatineni

అభివృద్దికి ఆనవాలు అమరావతి హోరులో యిరవై యేళ్లుగా నాన్చుతున్న రోడ్డు విస్తరణ కార్యక్రమం నట్లు కొట్టుకుంటూ సాగుతూ వుండటం వల్ల .. విజయవాడ చివరన వున్న మేము కూడా ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోక తప్పడంలేదు. అనుకున్న చోటికి సరైన సమయానికి చేరుకోవాలంటే అడ్డదారులు వెతుక్కోవాల్సిన పరిస్థితి. గూగుల్ మ్యాప్ ని శరణు వేడితే మా ఇంటికి వాయువ్య మూలనుండి కేవలం రెండు పర్లాంగుల దూరం వెళితే చాలు సులభంగా IRR కి వెళ్ళే దారి చూపించింది.

గుండుసూది by Vanaja Tatineni Read More »

అస్తిత్వసంతకం by S Sridevi

“ఆర్యూ క్రేజీ?” మెయిల్ చూసి వెంటనే ఫోన్ చేసి దిగ్భ్రాంతిగా అడిగింది హెచార్ మేనేజర్ లాస్య.
“సరిగానే నిర్ణయిచుకున్నాను. ఒక సమయంలో అవసరాలన్నీ డబ్బుగా మారిపోయాయి. తర్వాత డబ్బు కాలంగా మారింది. ఇప్పుడు కాలాన్ని ప్రేమగా మార్చుకోకపోతే ఆ తర్వాత మార్చుకోవటానికి ఇంకేదీ వుండదు” అంది ప్రజ్ఞ.

అస్తిత్వసంతకం by S Sridevi Read More »

Scroll to Top