Mangu Krishna Kumari

నేను మంగు కృష్ణకుమారి. ఇండియన్ నేవీలో 37 సంవత్సరాలు సర్వీస్ చేసి, ఆఫీస్ సూపరింటెండెంట్ గా రిటైర్ అయేను. చిన్నప్పుటినించీ కథల పుస్తకాలు విపరీతంగా చదవడం అలవాటు. చదువుకొనే రోజుల్లో ఓ కథ ఆంధ్రపత్రిక వార పత్రికలో వచ్చింది. ఆ తరవాత మళ్ళా రిటైర్ అయిన తరువాత ఫేస్‌బుక్ లోకి వచ్చి మళ్ళా కథలు రాయడం మొదలెట్టేను. మాకు ఒక అమ్మాయి. అమెరికాలో ఇద్దరు పిల్లలతో ఉంది.