Rakesh Yallamilli

నా పేరు రాకేష్ యల్లమెల్లి. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం, అయోధ్యలంక. నేను కొంతకాలం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసి, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్‌లో ఇన్స్పెక్టర్‍గా 2013 జాయిన్ అయ్యాను. ప్రస్తుతం నాగపూర్ రీజియన్ కింద ఉన్న బులదాన అనే జిల్లాలో సుపెరింటెండెట్ ఆఫ్ పొస్ట్ ఆఫీసెస్‍గా పనిచేస్తున్నాను. రాజమండ్రి లాలాచెరువు హౌసింగ్‍బోర్డు కాలనీలో ఉన్న గ్రంధాలయం నాకు దేవాలయంలాంటిది. చాలా విషయాలు నేర్పింది. ఎందరో కవులను పరిచయం చేసింది. ఇప్పటి వరకూ 10 కధలు రాశాను. అవి ఇలా అక్కడక్కడా వాట్సప్‍లో తిరుగుతుంటాయి. ఒక నవల చివరి దశలో ఉంది.ఇది పదకొండవ కథ. నాకు తొలకరి చినుకులు పడగానే వచ్చే మట్టివాసనంటే ఇష్టం. మనసుల్ని కట్టిపడేసే బంధాలంటే ఇష్టం. అనుబంధాలను ముడివేసే మనుషులంటే ఇష్టం. సమాజాన్ని ప్రశ్నించే రచయితలంటే ఇష్టం నాకు రానిదల్లా ...గతాన్ని మర్చిపోవడం కానిదల్లా .. నమ్మినవాళ్ళను వదిలిపోవడం

Scroll to Top