Sailaja Ramshah

పేరు: శైలజా రాంషా నివాసం: హైదరాబాద్ కార్పొరేట్ ఉద్యోగం చదువు: తెలుగు సాహిత్యం లో B.A. అమ్మ సాహిత్య ప్రయాణంలో తోడు వెళుతూ హాజరైన అనేక సాహితీసభలనుండి అందుకున్న చిన్నచిన్న మెరుపులతో సాహిత్యంపట్ల అభిలాష పెరిగింది. కొన్ని సంవత్సరాల జాతీయ పోలీసు అకాడెమీ వుద్యోగం, అక్కడి గ్రంధాలయంలో చదివిన పుస్తకాలు కధలు వ్రాయాలనే ఉత్సాహాన్ని కలిగించాయి. నాన్నగారు, శ్రీవారి ప్రోత్సాహంతో వ్రాయడం మొదలైంది. పత్రికలు ప్రచురించడం మొదలైనప్పటినుండీ మామయ్య కళ్ళల్లో కనిపించిన ప్రశంస, అమ్మాయి కళ్ళల్లో కనిపించిన ప్రైడ్, బైలైన్‍లో పేరు చూసుకొన్నప్పుడు కలిగిన సంతోషం ఇంకా వ్రాయాలనే ఆలోచనను పెంచాయి అంటారు శైలజా రాంషా. వీరి కధలు, వ్యాసాలూ, కవితలు వివిధపత్రికల్లో ప్రచురితమయ్యాయి. పలు ఆన్‍లైన్ ఫోరమ్‍లలో కధలు, బ్లాగులు ప్రచురితమయ్యాయి. సిలికానాంధ్ర, ఆంధ్రజ్యోతి, స్వాతి పోటీలలో చిన్న చిన్న బహుమతులు గెలుచుకొన్న ఆనందం ఉందంటారు. మొదటి కథ "బీజం" మే 16, 2002 సంచిక ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. పలు ఆన్లైన్ ఫోరమ్‍లలో కధలు, బ్లాగ్స్ ప్రచురితమయ్యాయి. సిలికానాంధ్ర, ఆంధ్రజ్యోతి, స్వాతి పోటీలలో చిన్నచిన్న బహుమతులు గెలుచుకున్న ఆనందం ఉందంటారు. మొదటి కథ "బీజం" మే 16, 2002 సంచిక ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది.

ప్లీజ్, మైండ్ యువర్ బిజినెస్ by Shailaja Ramsha

స్వర్ణ కూర్చోబెట్టి, కాఫీ ఇచ్చి, ఆవిడ ఇచ్చిన క్షమాపణ పత్రాన్ని, జాగ్రత్తగా చదివి, కొత్త ఫైల్ ఓపెన్ చేసి, అందులో పెట్టి, షెల్ఫ్‌లో పెట్టి ఆవిడ ఎదురుగానే లాక్ చేసింది.

ప్లీజ్, మైండ్ యువర్ బిజినెస్ by Shailaja Ramsha Read More »

వెఱపు by Sailaja Ramshaw

తన కొడుకు ఈ క్రైమ్‍లో ఉండి ఉంటే, తల్లితండ్రులుగా తాము ఏం చేయాలి? నిహాన్ తన స్నేహితులతో కలిసి చేసి ఉంటే వారి పరిస్థితి ఏమిటి? ఇలా రేప్, హత్యలాంటి నేరాలు చేసిన మైనర్ బాలలకి సమాజం ఏం చెపుతుంది?

వెఱపు by Sailaja Ramshaw Read More »

భూమిపుత్రుడు by Sailaja Ramshaw

ఈ బ్రతుకుఘర్షణలో మాకు తల ఎత్తి ఆకాశంవేపు చూడడానికి ధైర్యం చాలలేదు. అప్పుడంతా భూమి మీదే ఆధారపడి, అవకాశం దొరికిందని ఆకాశంలోకో, అనంతసముద్రజలాల్లోకో వెళ్లిపోవాలని అనుకోలేదు.

భూమిపుత్రుడు by Sailaja Ramshaw Read More »

Scroll to Top