Sailaja Ramshaw

పేరు: శైలజా రాంషా
నివాసం: హైదరాబాద్
కార్పొరేట్ ఉద్యోగం
చదువు: తెలుగు సాహిత్యం లో B.A.
అమ్మ సాహిత్య ప్రయాణంలో తోడు వెళుతూ హాజరైన అనేక సాహితీసభలనుండి అందుకున్న చిన్నచిన్న మెరుపులతో సాహిత్యంపట్ల అభిలాష పెరిగింది. కొన్ని సంవత్సరాల జాతీయ పోలీసు అకాడెమీ వుద్యోగం, అక్కడి గ్రంధాలయంలో చదివిన పుస్తకాలు కధలు వ్రాయాలనే ఉత్సాహాన్ని కలిగించాయి. నాన్నగారు, శ్రీవారి ప్రోత్సాహంతో వ్రాయడం మొదలైంది. పత్రికలు ప్రచురించడం మొదలైనప్పటినుండీ మామయ్య కళ్ళల్లో కనిపించిన ప్రశంస, అమ్మాయి కళ్ళల్లో కనిపించిన ప్రైడ్, బైలైన్‍లో పేరు చూసుకొన్నప్పుడు కలిగిన సంతోషం ఇంకా వ్రాయాలనే ఆలోచనను పెంచాయి అంటారు శైలజా రాంషా. వీరి కధలు, వ్యాసాలూ, కవితలు వివిధపత్రికల్లో ప్రచురితమయ్యాయి. పలు ఆన్‍లైన్
ఫోరమ్‍లలో కధలు, బ్లాగులు ప్రచురితమయ్యాయి. సిలికానాంధ్ర, ఆంధ్రజ్యోతి, స్వాతి పోటీలలో చిన్న చిన్న బహుమతులు గెలుచుకొన్న ఆనందం ఉందంటారు. మొదటి కథ “బీజం” మే 16, 2002 సంచిక ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది.
పలు ఆన్లైన్ ఫోరమ్‍లలో కధలు, బ్లాగ్స్ ప్రచురితమయ్యాయి. సిలికానాంధ్ర, ఆంధ్రజ్యోతి, స్వాతి పోటీలలో చిన్నచిన్న బహుమతులు గెలుచుకున్న ఆనందం ఉందంటారు. మొదటి కథ “బీజం” మే 16, 2002 సంచిక ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది.