Somanchi Sridevi

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‍లో వుద్యోగం. హెడ్‍పోస్ట్‌మాస్టర్‍గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ. వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో.  వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు. మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి. కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.

తప్పిపోయిన పిల్ల by S Sridevi

“ఆడపిల్లలతో పెద్ద తలకాయనొప్పిగా వుంది. ఇంటిమీద బెంగతోనో మరేకారణంతోనో సరిగ్గా చదవట్లేదని ఒకమాట మందలింపుగా అనేసరికి ఇంత పొడుగు వూహించేసుకుంటారు” అని చులకనగా అనేసాడు.

తప్పిపోయిన పిల్ల by S Sridevi Read More »

కనిపించని ఒకటో వంతెన by S Sridevi

యాభైమూడురోజులపాటు ఎడతెరిపిలేకుండా బూడిద వర్షం కురిసింది. కొంచెంకొంచెంగా రాల్తూ మనుషుల్ని వుక్కిరిబిక్కిరి చేస్తూ వాళ్ళ ప్రాణాలు తీసుకుంటూ వుంది.

కనిపించని ఒకటో వంతెన by S Sridevi Read More »

పండూ, బుజ్జీ, వాళ్ళబ్బాయీ by S Sridevi

కొన్ని భావాలు మౌనం వెనక వుండిపోతేనే బావుంటుంది. అవి వ్యక్తమైతే వాటికి మనుషుల ఆలోచన పునాదుల్ని కదిలించే బలం వుంటుంది.

పండూ, బుజ్జీ, వాళ్ళబ్బాయీ by S Sridevi Read More »

The Cold Cold Sea by Linda Huber – Review by S Sridevi

ఒక పసిపాప కనిపించకుండా పోతే, లేదా చనిపోతే ఆ కుటుంబాలలో ఎలాంటి విషాదం చోటుచేసుకుంటుందనేది ఒక ఎత్తైతే, ఆ తల్లులు పడే వేదన మరొక ఎత్తు.

The Cold Cold Sea by Linda Huber – Review by S Sridevi Read More »

Scroll to Top