Byomkesh Bakashi by Saradindu Bandopadhyay
పరిచయం – యస్. శ్రీదేవి

రచయిత శరదిందు బందోపాధ్యాయ్ జీవితకాలం 1899-1970. వీరు అనేక కథలు, నవలలు, నాటకాలు రచించారు. ముంబై సినిమా పరిశ్రమలో స్క్రిప్ట్ రైటరుగా కూడా చేసారు. వీరి స్వస్థలం కలకత్తా దగ్గరున్న బారాపూర్ అనే గ్రామం. తండ్రి వుద్యోగరీత్యా బీహారులో నివశించేవారు. రచయిత లా పరీక్ష రాసి పాసై, న్యాయవాద వృత్తి వదిలిపెట్టి, రచనావ్యాసంగాన్ని వృత్తిగా స్వీకరించారు. వీరు సృష్టించిన బ్యోమకేశ్ బక్షి, బొరో దా, సదాశివ్ ఇంకా అనేక పాత్రలు భారతీయ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. బ్యోమకేశ్ బక్షి డిటెక్టివ్ పాత్ర. కానీ ఇతడు తనని నేరపరిశోధకుడని అంటే వప్పుకోడు. సత్యాన్వేషినని చెప్పుకుంటాడు. ఇతని మితృడు అజిత్ బాబు. ఇద్దరూ కలిసి ఎన్నో నేరాలు పరిష్కరిస్తుంటారు. రఖాల్ బాబు పోలీసు ఇన్స్పెక్టరు. నేరపరిశోధనలో బ్యోమకేశ్ బక్షి ఇతనికి సాయం చేస్తుంటాడు.
ప్రపంచసాహిత్యంలోని మొదటి పది డిటెక్టివ్ పాత్రల్లో ఇతను ఒకడు. బ్యోమకేశ్ బక్షి ప్రధానపాత్రగా దాదాపుగా 35 రచనలు చేసారు రచయిత. ఇవన్నీకూడా 1932-1970 నడుమ బెంగాలీలో రాసినవి. ప్రస్తుతపు పుస్తకాన్ని మొనిమాలాధర్ (మణిమాలాధర్) ఇంగ్లీష్‍లోకి అనువదించారు. అనువాదం సరళంగా వుంది. కథలన్నీ ఆసక్తిదాయకంగా వున్నాయి. ఎక్కడా అనువాదం అనే భావన కలగదు. ఈ పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్‌వారు ప్రచురించారు. 2003లొ ప్రథమ ప్రచురన జరిగింది. పదో ముద్రణ 2016లో జరిగింది. అప్పతి వెల రూ296/-
ఈ సంపుటంలో 7 కథలున్నాయి. కథలన్నీ అప్పటి బెంగాలు వాతావరణాన్ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తాయి. జమీందారులు, వారి విలాసాలు, జీవనవిధానం, ఆ జీవనవిధానంలోంచీ పుట్టుకొచ్చే సమస్యలు, వీటిని బ్యోమకేశ్ బక్షి పరిష్కరించిన తీరు కథావస్తువులుగ సాగుతాయి. కథలు చదువుతుంటే పాతకాలపు సినిమాలు చూస్తున్న భావన కలుగుతుంది.
మొదటి కథ “ద డెడ్లీ డైమండ్”. రామనాథ నియోగి అనే దొంగ విడుదలకావటంతో కథ మొదలౌతుంది. పదేళ్ళక్రితం ఊళ్ళోని నగలదుకాణాల్లో వరుస దొంగతనాలు జరుగుతాయి. రమణేంద్రసింహుడనే మహారాజు యింట్లో కూడా దొంగతనం జరుగుతుంది. మహారాజు దగ్గర నీలిరంగు వజ్రం పొదిగిన వుంగరం వుంటుంది. రాయి వదులవటంతో కంసాలిచేత మరమ్మత్తు చేయిద్దామని తీసి పక్కన పెట్టినప్పుడు మిగిలిన నగలతోపాటు అదికూడా పోతుంది. ఆ వజ్రం తన అదృష్టానికీ, సిరిసంపదలకీ కారణమైనదని బలంగా నమ్ముతాడు ఆ రాజు. పోలీసుల ప్రయత్నాలవల్ల పోయిన వస్తువులన్నీ దొరుకుతాయిగానీ యీ వజ్రం మాత్రం దొరకదు. అతడు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. చివరికి దొంగిలించిన దొంగనికూడా ప్రలోభపెట్టి దాన్ని వెనక్కి తెచ్చుకోవాలనుకుంటాడు. ఏ నమ్మకంవలన రాజు దానికోసం అంతగా తాపత్రయపడతాడో అలాంటి నమ్మకాన్నే ప్రయోగించి దొంగనుంచీ వజ్రాన్ని తిరిగి సంపాదించడం ఈ కథలో వుంటుంది. నమ్మకం అనేది రెండువైపులా పదునుగల కత్తి అనేది నిరూపిస్తాడు బ్యోమకేశ్ బక్షి.
“ద హిడెన్ హెయిలూమ్” మరో కథ. ధనికులు, జమీందారులు తమదగ్గరున్న విలువైన ఆభరణాలనీ వజ్రవైఢూర్యాలనీ ప్రదర్శనకి పెడుతుంటారు. అలాంటి ప్రదర్శనలో కుమార్ త్రిదిబేంద్ర (త్రిదేవేంద్ర)కి వారసత్వంగా మొఘలులనుంచి వచ్చిన వజ్రం మాయమై దాని స్థానంలో నకిలీ వజ్రం వుంచబడుతుంది. దాన్ని దొంగిలించిన వ్యక్తి చాలా ప్రముఖుడు. అతన్ని దొంగ అనడానికి లేదు. బ్యోమకేశ్ బక్షి తన మితృడితో ఆ యింట్లో చేరతాడు. వాళ్ళు ఎందుకు వచ్చారో ఆ ప్రముఖునికి తెలుసు. ఇల్లంతా వెతుక్కోమంటాడు. లంకంత యిల్లు. ఇంటిచుట్టూ తోట. వారంరోజుల వ్యవధి. ఎక్కడని వెతుకుతారు? ఎంతో చతురతో దాన్ని కనుగొంటారు.
“ద అవెంజర్‍” లో ఒక యువతి హత్య, దానికి ప్రతీకారం కథకి మూలవస్తువు.
“ద మేన్ ఇన్ రెడ్ కోట్‍” లో మీరట్‍నుంచీ కలకత్తానగరానికి ఏదో పనిమీద వచ్చిన అశోక మైతీ అనే వ్యక్తి ధర్మశాలలో దిగాలనుకుంటే అందులో గదులు ఖాళీ వుండవు. అతనికి గది దొరకలేదని గ్రహించిన గంగాపద చౌదరి అనే వ్యక్తి ధర్మశాల అవతల అతన్ని కలిసి పరిచయం చేసుకుంటాడు. నెలరోజులపాటు తను దేశపర్యటనకి వెళ్తున్నాడనీ అభ్యంతరం లేకపోతే తనగదిలో వుండవచ్చనీ చెప్తాడు. వేరేవ్యక్తిని తెచ్చి యింట్లో వుంచినట్టు తెలిస్తే యింటి యజమాని వప్పుకోడుగాబట్టి తన పేరే అతని పేరుగా చెప్పమని అంటాడు. అశోక మైతీ వప్పుకుని గంగాపద గదికి వెళ్తాడు. గదికి ఒక కిటికీ వుంటుంది. ఎర్రకోటు వేసుకున్న వ్యక్తి ఎవరేనా ఆ చుట్టుపక్కల తిరుగుతున్నాడేమో మధ్యమధ్యలో కిటికీలోంచీ గమనించమని అడుగుతాడు. నిజానికి గంగాపద ఒక నేరస్తుడు, మరొక నేరస్తుని దృష్టిలో వున్నవాడు. అశోక్ మైతిమీద కాల్పులు జరుగుతాయి. చావు తప్పి హాస్పిటల్లో పడతాడు. ఈ యిద్దరిమధ్యనుంచీ అశోక్ మైతీని బ్యోమకేశ్ బక్షి, రకాల్‍బాబు ఎలా బయటపడేస్తారన్నది ఈ కథ.
“ద ఫాంటమ్ క్లయ్ంట్” లో దయ్యం తరపుని బ్యోమకేశ్ బక్షి ఒక హత్యానేరాన్ని పరిష్కరిస్తాడు.
“రూమ్ నెంబర్ ఒన్ నాట్ టూ”లో నిరుపమా హోటల్లో నూటరెండో గదిలో జరిగిన సుకాంతో అనే ఒకప్పటి నటుని హత్య జరుగుతుంది. దాన్ని ఎవరు చేసారో ఇన్స్పెక్టరు సాయంతో బయటపెడతాడు.
“క్విక్ సాండ్” లో కుమార్ త్రిదిబేంద్ర (త్రిదేవేంద్ర)కి అతిథిగా వెళ్ళిన బ్యోమకేశ్ బక్షి, అజిత్‍బాబు హిమాంశు అనే అతని మితృడి అడవిలో వేటకి వెళ్ళినప్పుడు అక్కడికి హిమాంశుకూడా వచ్చి కలుస్తాడు. అడవిలో ఒక వూబి వుంటుందని తెలుసుగానీ, అదెక్కడుందో ఎవరికీ తెలీదు. హిమాంశు ఎస్టేటు వ్యవహారాల్లో అనుభవం లేని మనిషి. అన్నీ దివానుమీద వదిలిపెట్టి తను వేటలో మునిగి తేలుతుంటాడు. తండ్రి చనిపోయాక ఆర్థికపరిస్థితులు తలకిందులౌతాయి. నిండా అప్పుల్లో వుంటాడు. కౌలుదారులు, రైతులు డబ్బులు చెల్లించకుండా ఇబ్బందిపెడుతుంటారు. కోర్టు కేసులు నడుస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో హరినాథ చౌదరి అనే యువకుడు ఏదేనా పని యిప్పించమని ఇతని దగ్గరికి వస్తాడు. అతను బాగా చదువుకున్నవాడు. తన ఏడేళ్ళ కూతురికి హోమ్ ట్యూటరుగా చేర్చుకుంటాడు. ఈ వ్యక్తికి వాళ్ళ పాత అకౌంటు పుస్తకాలుండే గదిలో వుండటానికి ఏర్పాట్లు చేస్తాడు దివాను. కొద్దినెలలు గడిచాక హరినాథ చౌదరి కోర్టుకేసుల్లో ముఖ్య ఆధారాలైన అకౌంటుపుస్తకాలు, ఆరువేల డబ్బుతో మాయమౌతాడు. ఈ కేసుని బ్యోమకేశ్ బక్షి, అజిత్ కలిసి పరిష్కరిస్తారు.

2 thoughts on “Byomkesh Bakashi by Saradindu Bandopadhyay<br>పరిచయం – యస్. శ్రీదేవి”

  1. I was wondering if you wanted to submit your new site to our free business directory? bit.ly/submit_site_t9qPdO4E2oF2

  2. Hey there,

    I hope you’re doing well. I wanted to let you know about our new BANGE backpacks and sling bags that just released.

    Bange is perfect for students, professionals and travelers. The backpacks and sling bags feature a built-in USB charging port, making it easy to charge your devices on the go. Also they are waterproof and anti-theft design, making it ideal for carrying your valuables.

    Both bags are made of durable and high-quality materials, and are perfect for everyday use or travel.

    Order yours now at 50% OFF with FREE Shipping: https://bangeshop.com

    To your success,

    Tomoko

Comments are closed.