A.ILU by Manas Krishna Kant

  1. ఆదర్శం by Manas Krishna Kant
  2. ఇది కథ కాదు by Manas Krishna Kant
  3. కడలి by Manas Krishna Kant
  4. A.ILU by Manas Krishna Kant
  5. తీరిన కోరిక by Manas Krishna Kant
  6. ఆకాశగంగ by Manas Krishna Kant
  7. కాలభ్రమణం by Manas Krishna Kant
  8. పాతబంగళా by Manas Krishna Kant
  9. రెక్కలగుర్రం by Manas Krishna Kant
  10. పరిశోధన by Manas Krishna Kant
  11. సింహావలోకనం by Manas Krishna Kant
  12. పరిష్కారం by Manas Krishna Kant
  13. దివ్యశక్తి by Manas Krishna Kant

“హీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫైనెస్ట్’. అందుకనే అతడిని సెలక్ట్ చేశాం ఈ మిషన్‍కోసం. ఇంకా అతనికి చెప్పలేదు. వియ్ హేవ్ టు బ్రీఫ్ హిమ్ ఎబౌంట్ ఇట్. కొన్ని నిమిషాల్లో అతను ఇక్కడికి రావచ్చు”’’
‘‘ఐ డూ ఎగ్రీ దట్ మి ఈజ్ ది బెస్ట్, ది ఎకాడమీ హేజ్ ప్రొడ్యూస్డ్, బట్ హి ఈజ్ ఎ బిట్ అన్‍ప్రెడిక్టబుల్ అండ్ వొలటైల్. అందుకే ఆటోచిస్తున్నాను ఈ మిషన్‍కి అతడిని ఎంపిక చేయడం సరైనదా, కాదా అని. అతనికి సామాజిక సంబంధాలు, రూల్స్ రెగ్యులేషన్స్‌మీదకూడా పెద్దగౌరవం లేదు. హయరార్ఖీనికూడా ఖాతరు చేయడు. హి ఈజ్ ఆల్వేజ్ ఆన్ ఎ షార్ట్ ప్యూజ్. హి కన్సిడర్స్
హిమ్‍సెల్ఫ్ ఏజ్ మేవరిక్. అలాంటివాడు ఈ పనికి సూట్ అవుతాడా?”’’
‘‘ఎక్సాక్ట్లీ! దటీజ్ ద రీజన్ వియ్ ఆర్ ప్రపోజింగ్ హిమ్ ఫర్ దిస్ మిషన్. ఇది ఒక అసాధారణమైన మిషన్. బహుశా మానవజాతి చేస్తున్న మొట్టమొదటి సీక్రెట్ ఆపరేషన్ ఇన్వాల్వింగ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్స్ వర్కింగ్ టుగెదర్. అతను మనకు ఎంత ఎస్సెట్టో అంతే న్యూసెన్స్‌కూడా కదా. సో ఇఫ్ ఉయ్ సక్సీడ్, ద సక్సెస్ ఈజ్ అవర్స్. ఇఫ్ వియ్ లూస్, ద ఫెయిల్యూర్ ఈజ్ హిజ్”’’
ఇంతలో అక్కడికి చేరుకున్నాడు పైలట్ అర్జున్. అసాధారణ ప్రతిభావంతుడు. అత్యంత క్లిష్టతరమైన మ్యానూవర్స్ చేయడంలో దిట్ట. మొండి ఘటం. ఏ రకమైన ఫ్లయింగ్ డివైజ్‍ని అయినా అవలీలగా హేండిల్ చేయగలడు. డ్రోన్స్‌నికూడా రిమోట్‍గా నడిపించి లక్ష్యాన్ని ఛేదించడంలో దిట్ట. అనేక సీక్రెట్ ఆపరేషన్స్‌లో పాల్గొన్నాడు. అతను వెళ్ళివచ్చిన ఆపరేషన్స్ అన్నీ సక్సెస్. హి ఆల్వేజ్ ఫ్రిఫర్స్ గోయింగ్ ఎలోన్. ఎప్పుడూ క్వశ్చన్స్ వేయడు, ఆన్సర్స్ ఇవ్వడు. సీనియర్, జూనియర్‌కంటేకూడా, కంటెంట్ ఉంటేనే కన్విన్స్ అవుతాడు. హి ఈజ్ జస్ట్ ఏన్ ఎమ్మో ఫర్ ద ఫోర్స్ బట్ ఎగొనీ ఫర్ ద ఎనిమీ
హయ్యర్ ఆఫీసర్ సీక్రెట్ మిషన్‍కోసం బ్రీఫ్ చేస్తున్నాడు. మామూలుగానే ముఖంలో ఏ భావం కనిపించని అర్జున్‍కు బ్రీఫ్ చేస్తున్నప్పుడు ఇంకా కఠినంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మిషన్‍గురించి చెప్పడం మొదలుపెట్టాడు ఆఫీసర్. ఇంటర్నేషనల్ ఏజెన్సీనుంచి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఒక కోడ్ ఒక స్పెసిఫిక్ ప్రాంతం నుంచి వస్తున్నట్టు. కానీ, ఏ రాడార్లూ కనిపెట్టలేకపోయాయి ఆ ప్రాంతాన్ని. అలానే ఆ కోడ్‍కూడా డీకోడ్ చేయడం ఎవరివల్లా కాలేదు. ఆ ప్రాంతం కోఆర్డినేట్స్‌కూడా మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి డెసిషన్ తీసుకున్నా అది అంతర్జాతీయంగా, రాజకీయంగా చాలా ప్రమాదకరంగా మారే సూచనలున్నాయి, అందువల్ల ఈ మిషన్‍ని సీక్రెట్‍గా ముగిద్దాం అనుకుంటున్నాం. సో వియ్ హేవ్ ఓన్లీ యు ఆన్ అవర్ మైండ్. కాకపోతే ఈ ఆపరేషన్‍లో నువ్వెప్పుడూ వాడని విమానాన్ని వినియోగించాల్సి వస్తుంది. అది పూర్తిగా మాన్యువల్ కాదు, పూర్తి ఆటోమేటిక్‍కూడా కాదు. కృత్రిమమేథతో నిర్మించిన అత్యాధునిక ఫ్యూచురిస్టిక్ యుద్ధవిమానం. అది నువ్విచ్చిన కమాండ్స్‌ని డీకోడ్ చేసి, ద బెస్ట్ సూటబుల్ అవుట్‍పుట్‍ని ఇస్తుంది. అతిదగ్గర మార్గం, అతితక్కువ ఇంధనంతో గమ్యం చేరే మార్గం, గాలియొక్క ఘర్షణ, ఎత్తు, బరువు అన్నీ పరిగణలోకి తీసుకొని అత్యుత్తమంగా అతిసులభమైన దారిని చూపిస్తుంది. ఇంకా, చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది అవతార్ సినిమాలో చూపించినట్టు, జంతువులూ, మనుషులూ ఎలాగైతే న్యూరల్
నెట్‍వర్కింగ్ జరుపుకొని ఒకరికొకరు అనుసంధానించబడతారో అలా పని చేస్తుంది. ట్రయల్ రన్స్ కాలేదుగానీ సిమ్యులేటర్‍మీద కొన్నిసార్లు పరీక్షించడం అయింది. ఇట్స్ నాట్ యెట్ రెడీ ఫర్ ద ఫ్లయిట్ ఇన్ రియల్ సెన్స్ బట్ వియ్ హేవ్ నో అదర్ ఆప్షన్”’’
‘‘వెన్ షుడ్ ఫ్లై?”’ అన్నాడు అర్జున్.
‘‘ఇంకేం ప్రశ్నల్లేవా? టార్గెట్ తెలీదు, సిగ్నల్ డీకోడింగ్ తెలీదు, ఈ ఫ్లయిట్ నడపడం తెలీదు. ఏమీ తెలియకుండా ఎలా? ఇట్స్ మియర్ ఇర్రెస్పాన్సిబిలిటీ”’’ సుపీరియర్ ఆఫీసర్.
“జస్ట్ ఫీడ్ ద ఇన్ పుట్ టు ద ఎఐ’ అండ్ గివ్ మి ద యాక్సెస్ కోడ్. దట్ విల్ డు ద జాబ్”’’అర్జున్ జవాబు. అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ వింతగా కనిపిస్తున్న విమానం వంక చూశాడు. పక్కగా వచ్చి నిలబడ్డ ఆఫీసర్ ఒక మెమరీ చిప్‍ని, ఒక కొత్తతరహా పరికరాన్ని ఇచ్చి, “రేపు ఉదయం 4 గంటలకు బయల్దేరా” లని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
తన కేబిన్ రూమ్‍కి వెళ్ళి అర్జున్ ఆలోచించసాగాడు. ఏది శాశ్వతం జీవితంలో? తనదనుకున్నది ఏదీ తనకు దక్కలేదు. అప్పట్నుంచీ అనుకోవడం మానేశాడు. అన్‍సెర్టనిటీ ఈజ్ ద ట్రూ సెర్టనిటీ ఆఫ్ లైఫ్ అనే సూత్రంమీద బతుకుతున్నాడు. బ్రతుకుమీద కోపం లేదు, నిరాసక్తత కాదు, నిర్లిప్తత అసలే కాదు, అహంకారం లేదు, బాధ రాదు. ఒక రకమైన కేర్‍లెస్‍నెస్. పెద్దవాళ్ళు దాన్నే నిర్లక్ష్యం అంటారేమో, కానీ ఇప్పటితరం దాన్ని కూల్‍నెస్’ అంటుంది. ఎక్కడికెళ్ళాలో తెలియదు, ఎలా నడపాలో తెలియదు, ఎందుకెళ్ళాలో తెలియదు, అసలు ఈ మిషన్ ఎందుకో తనకు చెప్పలేదు, తనూ అడగలేదు. ఎఐ మీద నమ్మకం లేదు, ఏంటో అంతా తమాషాగా అనిపించింది. కానీ, సిగ్నల్ ఎక్కడ్నుంచి వస్తుందో, కోఆర్డినేట్స్‌ని కనుక్కోవాలి. అది మొదటిది. ఆ వచ్చిన సిగ్నల్‍ని డీకోడ్ చేయాలి. రీఫ్యూయలింగ్ ఉంటుందా? వస్తున్నప్పుడు సోలార్ ప్యానల్స్‌ని చూసినట్టూ గుర్తు. అలానే రేడియో ఏక్టివ్ సింబల్‍కూడా చూసినట్టుంది వెనకాల. ఇదేదో హైబ్రిడ్ విమానమేమో అనుకుంటూనే, విమానం నడపడానికి ఉండాల్సింది ధైర్యం అనుకుని నవ్వుకున్నాడు.
తనకిచ్చిన మెమొరీ చిప్‍ని చేతికున్న స్లిమ్ కంప్యూటర్‍లోకి పెట్టి కంటెంట్స్‌ని చెక్ చేస్తున్నాడు. ఇందులో చాలా ఇన్‍ఫర్మేషన్ ఉంది. మరి ఆ ఆఫీసర్ అక్కడెందుకు చెప్పలేదు? ఇంకో ఆఫీసర్ ఉన్నాడనా? ఇంత సీక్రెట్ మిషనా ఇది? ఈ డివైజ్ ఏంటి? అని ఇచ్చిన ఇంకో పరికరాన్ని అటూ ఇటూ తిప్పి చూస్తుండగా దాన్లోంచి లేజర్ ప్రొజెక్షన్స్ వచ్చి అది ఎఐని ఏక్సస్ చేసే పరికరమని, దాన్ని వాడే పద్థతులు అన్నీ ఇందులో ఫీడ్ చేసి ఉన్నాయని, ఒకవేళ విమానంనుంచి దూరంగా వెళ్ళిపోయినా దీని సహాయంతో దాన్ని ఆపరేట్ చేయవచ్చని, ఎఐకి ఇది మోసుకెళ్ళగలిగే వెర్షన్ అనీ చెప్పింది. ఏక్సెస్ కోడ్‍కోసం అడిగితే, తనే సక్సెస్ కోడ్ అని చెప్పింది.
3:50కి అలారం మోగింది. పదినిమిషాల్లో ఉన్నాడు విమానం దగ్గర. అక్కడ అతనికి ఆ ఫ్లైట్ పనితీరు వివరించేందుకు చీఫ్ ఇంజినీర్ ఉన్నాడు. అతనితోపాటు ఒక కంప్యూటర్ ఇంజినీర్, ఒక న్యూరో సైంటిస్ట్‌కూడా వెయిట్ చేస్తున్నారు. ఫ్లైట్‍కోసం కొత్తగా డిజైన్ చేసిన సూట్ వేసుకుని కాక్‍పిట్‍లో కూర్చున్నాడు అర్జున్. చీఫ్ ఇంజినీర్ దానిని ఎలా నడపాలో చెబుతున్నాడు, కంప్యూటర్ ప్రోగ్రామర్ చివరి నిమిషంలో కోడ్స్ అన్నిటినీ చెక్ చేసుకుంటున్నాడు. న్యూరో సైంటిస్ట్ అర్జున్‍తో మాట్లాడడానికి నిశ్శబ్దంగా వెయిట్‍చేస్తున్నాడు.
చీఫ్ ఇంజినీర్ చెబుతున్నాడు. “ఇది ఇప్పటివరకూ ఏ దేశమూ తయారు చేయ్యనటువంటి మెషీన్. ఇప్పటివరకూ ఏ ఎగిరే ఫ్లైట్ అందుకోని వేగాన్ని అందుకుంటుంది. క్లాసిక్ ఫిజిక్స్ లాస్ ఆ వేగంలో వర్తిస్తాయా, వర్తించవా అన్న విషయాన్నికూడా ఇంకా టెస్ట్ చేయలేదు. కొంత దేశం దాటాక మేటర్ (పదార్థం) స్వభావంలో మార్పులు సంభవించవచ్చు. అలానే కొంత పరిణామం తగ్గాకకూడా మారవచ్చు. ఇప్పుడదే నానో టెక్నాలజీలో జరిగేది. ఈ ప్లేన్ తయారీలో నానో టెక్నాలజీ వాడాం, నానో బ్యాటరీ సెల్స్, నానో టెక్నాలజీ కోటింగ్, సోలార్ ప్యానెల్స్‌లో కూడా నానో టెక్నాలజీ వాడి, సూర్యకాంతిని చాలా వరకు శక్తిగా మార్చే ఏర్పాట్లు చేశాం. అలాగే న్యూక్లియర్ ఫ్యూయల్‍తోకూడా ఆపరేట్ చేయొచ్చు. కానీ, అది చాలా అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించాలి. దీని ఎఫిషియెన్సీమీద మాకు నమ్మకం ఉంది, కానీ స్టెబిలిటీమీదనే ఇంకా పరిశోధనలు, టెస్టులు చేయాల్సి ఉంది. కానీ, మిస్టర్ ప్రెసిడెంట్ ఎందుకో అత్యవసరంగా ఈ మిషన్‍ని స్టార్ట్ చేయమనడంవల్ల తప్పలేదు. యూ ఆర్ అవర్ గినీపిగ్ అండ్ ఐ యామ్ సోరీ ఫర్ మేకింగ్ యు వన్” అని సీరియస్‍గా ముఖం పెట్టి దిగిపోయాడు.
తర్వాత వంతు న్యూరోసైంటిస్ట్‍ది. దగ్గరగా వచ్చాడు. చీఫ్ ఇంజినీర్‍కంటే కొంచెం చిన్నవాడు. కానీ మెదడు పనితీరుమీద పనిచేయడంవల్లనేమో, ఆలోచనారహస్యాలు అన్నీ తెలిసినవాడిలాగా జీవితాన్ని కాచివడబోసినవాడిలా, చాలా పెద్దవాడిలా గౌరవం ఇవ్వాలనిపించేటట్టుగా ఉన్నాడు. ఇలా చెబుతున్నాడు.
“నేను కేవలం థియరెటికల్‍. లాబ్‍లోమాత్రమే మెదడుపై ప్రయోగాలు చేస్తా. కానీ, ఇది నువ్వు నిజజీవితంలో చేస్తున్నందుకు ఒకవైపు గర్వంగా ఫీలవుతున్నా, ఒకవైపు మాత్రం భయంగానే ఉంది. నువ్వు ఇదివరకే అనేక యుద్ధవిమానాలను శబ్దంకంటే ఎన్నోరెట్లు వేగంగా నడిపి ఉండొచ్చు. ఈ పరికరం ఎంత వేగాన్ని అందుకోగలదో, ఇంకా శాస్త్రీయంగా టెస్ట్ చేయబడలేదు. ఇప్పటివరకు అందుకోలేని వేగాన్ని అందుకుంటుంది. దానివల్ల శరీరంలో జరిగే చర్యలన్నీ చాలా నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ఒక్క ఆలోచించే చర్య తప్ప. అందువల్ల కంటికి కనిపించేవి, వినిపించేవి, స్పర్శకు అనిపించేవి అన్నీ అతీంద్రియ, అలౌకిక భావనను కలిగించవచ్చు. రక్త ప్రసరణ, గుండెవేగం అన్నీ మందగిస్తాయి. ఇంకా నువ్వు ట్రైనింగ్‍కూడా తీసుకోలేదు. కాబట్టి నీ శరీరం ప్రతిస్పందించే విధానంకూడా చాలా విచిత్రంగా అనిపించొచ్చు. ఈ క్యాప్సుల్స్ తీసుకో. ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు పంటికింద పెట్టుకుని కొరికేయ్, కొంత ఉపశమనం ఉంటుంది. కానీ, నువ్వు తిరిగొచ్చాక, వచ్చినట్టయితేగనుక ఈ ప్రభావం చాలానెలలు ఉండొచ్చు” అని ఒక విచారకరమై నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు.
ఇక కంప్యూటర్ ప్రోగ్రామర్ వంతు. చూడ్డానికి కాలేజీ కుర్రాడిలా ఉండి, ముందొచ్చిన ఇద్దరికంటే చాలా కాజువల్‍గా కనిపించాడు. రెండుమూడుచోట్ల సూట్‍కి వైరింగ్ అమర్చి, హెల్మెట్‍లాంటిది అందించాడు. పెట్టుకోగానే దానికొక వైర్‍ని అమర్చాడు. అప్పుడు చెప్పడం మొదలెట్టాడు.
“ఇది కేవలం ఒక ఎగిరే ప్లేన్‍మాత్రమే కాదు, కృత్రిమమేథతో పనిచేసే రోబో అనుకోవచ్చు. ఇది సొంతంగాకూడా నిర్ణయాలు తీసుకోగలదు. దీనితో అనుసంధానించబడిన మనిషి మానసికస్థితికి అనుగుణంగా నడుచుకుంటుంది. ఇది ఒక మనిషిలాగానే ప్రవర్తిస్తుంది. మాట్లాడుతుంది, కవితలూ, కథలూకూడా చెబుతుంది. సొంతంగా ప్రోగ్రామింగ్‍కూడా చేసుకుంటుంది. కాకపోతే మనుషులకు ఉండేటట్లు ఎమోషన్స్‍మాత్రం ఉండవు. ఇట్స్ ఫార్ ఎహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. ఇది ఒకసారి ఇంటిగ్రేట్ అయితే చాలా త్వరగా దాని యజమాని మనస్తత్వాన్ని అర్థం చేసుకుని తనని తాను మలచుకుంటుంది. ఎనీవే యూ ఆర్ గోయింట్ టు ఎక్స్‌పీరియెన్స్ ఇట్ నవ్” అని ఒక స్విచ్ నొక్కాడు.
అంతే! ఎన్నో లైట్లు వెలిగాయి సూట్‍నిండా, హెల్మెట్ టైట్‍గా పట్టేసినట్టయింది. “వెల్‍కమ్”’ చెప్పింది ఎఐ. దానికింకా పేరు పెట్టలేదుకాబోలు! గర్వంగా నవ్వుతూ దిగిపోయాడు కంప్యూటర్ ఇంజినీర్. కాక్‍పిట్ క్లోజ్ అయిపోయింది. మెమొరీ చిప్‍ని ఇన్‍సర్ట్ చేశాడు. సిగ్నల్స్ వస్తున్నవైపుకి వెళ్ళమని వాయిస్ కమాండ్ ఇచ్చాడు. అసలు ప్రయత్నిద్దాం, వీళ్ళంతా ఇంత హైప్ ఇచ్చారుగా? అసలు పని చేస్తుందా లేదా? అని.
కమాండ్ సెంటర్ ఏక్టివేటెడ్, మోషన్ సెన్సర్స్ ఏక్టివేటెడ్, ఏమ్మో (Ammo) ఏక్టివేటెడ్, coordination not clear as of now but the ship start to fly అని చెప్పి ఎగిరింది గాల్లోకి. ఎవరూ లేరు ‘బై’ చెప్పడానికికూడా, ఇది ఏమన్నా సైకిల్ నేర్చుకోవడం అనుకుంటున్నారా అందరూ అనుకుంటున్నంతలో వేగం పుంజుకుంది.
ఎయిర్‍బేస్‍ని దాటి ఎప్పుడు వెళ్ళిపోయిందోకూడా తెలియలేదు. ఎక్కడికి చేరుకుంటుందో తెలియదు. దాని వేగం మాత్రం ఇంతకు ముందు తను నడిపిన అత్యంత వేగవంతమైన విమానంకన్నా ఎన్నోరెట్లు ఎక్కువ ఉంది. బయటి ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. కళ్ళకి కాంతితప్ప ఇతరవస్తువేదీ కనిపించడంలేదు, శబ్దంకూడా కొన్ని వందలరెట్లు వెనకబడిపోయినట్టు అనిపిస్తోంది. అసలు వినిపించడమే మానేసింది. కళ్ళు బైర్లుకమ్మడం అంటే ఇదేనేమో! నక్షత్రాలు చాలా దగ్గరగా కనిపిస్తున్నట్లున్నాయి. డీహైడ్రేషన్ ఏమో అనుకుంటున్నాడు. ఆలోచనలకంటే వేగంగా ప్రయాణిస్తున్నట్టుంది ఈ విమానం.
కన్నుమూసి తెరిచేలోగా రియర్ వ్యూ మిర్రర్‍లో నీలిరంగులో ఉన్న గుండ్రని బంతిలాంటి ఆకారం కనిపించింది. ఆకాశంనుంచి కనిపిస్తున్న భూమి అది. అంటే తను భూకక్ష్యను దాటేశాడా? రోదసిలోకి వచ్చేశాడా?? కానీ ఇంకా ఇంజన్లు ఆగలేదు?? ఆక్సిజన్ అవసరం లేదుకదా?? న్యూక్లియర్ ఫ్యూయల్‍గానీ, సోలార్‍సెల్స్‌గానీ పనిచేయడం మొదలుపెట్టాయి అనిపించింది. ఇదంతా ఆ మేజర్ జనరల్‍కి ముందే తెలుసునా? రోదసిలోకి ప్రయాణం అని చెప్పలేదా? అదికూడా ఒంటరిగా, ఒక పరిశోధనాస్థాయిలో ఉన్న మెషీన్ సాయంతో!!
నిరంతరాయంగా వస్తున్న ఆలోచనలను భగ్నం చేస్తూ ఎఐ అంది, “డోన్ట్ వర్రీ! నేను పరిశోధనలో ఉన్న మెషిన్‍నే కానీ, చాలాత్వరగా పరిస్థితుల్ని అర్థం చేసుకుని డెసిషన్స్ తీసుకొని, నా పైలట్‍తో సమాంతరంగా ఆలోచిస్తూ, వాళ్ళ లోటుపాట్లని గుర్తిస్తూ నాకు నేనుగా పనిచేసుకుపోతాను. ఎండ్ ఐ యామ్ ఎఫిషియంట్”
ఏదో సమాధానం ఇద్దామనుకున్నాడు, కానీ ఏం అనాలో తోచక మెషీన్‍తో మాట్లాడ్డం కొత్తకావడంవల్ల వినడానికే మొగ్గు చూపాడు. ఐతే, మెషీన్ మరి మాట్లాడలేదు, అర్జున్ మనసు ఖాళీగా ఉండడం వల్లనేమో.
చుట్టూ దట్టమైన చీకటి, దూరంగా భూమి, ఎప్పుడూ రాని చోటు కోఆర్డినేట్స్ మాత్రం ఉన్నట్టే చూపిస్తుంది మెషీన్. అనంతమైన ఈ విశ్వంలో ఆ స్థలాన్ని వెదకటానికి ఎఐకికూడా చాలా సమయం కావాల్సి ఉంది. టైం తెలియకుండా ఉంది. ఎక్కడాకూడా టైం తెలిపేందుకు అవకాశమివ్వలేదు, బయలుదేరే ముందు డాక్టర్ తన చేతికున్న ఎనలాగ్ వాచీని తీసివ్వమని చెప్పాడు. తనకి అది అత్యంత ప్రియమైనది అయినాసరే, ప్రోటోకాల్ ఏమో అని తీసిచ్చేశాడు. లోపలకూడా ఎక్కడా వాచీ లేదు, క్లాక్ కూడా. ఇంత వేగంగా వెళ్తున్న విమానంలో. ఇప్పుడు దీన్ని స్పేస్ షిప్ అనాలేమో!
అప్పటికే తనకి చాలా విచిత్రంగా అనిపించింది. దీని ఆకారం చూసి. స్పేస్‍లోకి వెళ్తుందనిమాత్రం అనుకోలేదు. అసలు మామూలు స్పేస్ – టైం రిలేషన్‍షిప్ వర్తిస్తుందా?? తను ఫిజిక్స్ ఎప్పుడో చిన్నప్పుడే చదువుకున్నాడు! క్లాసికల్ ఫిజిక్స్ లాస్, క్వాంటమ్ లెవెల్లో వర్తించవని పూర్తి భిన్నంగా పదార్థాల బిహేవియర్ ఉంటుందని మాత్రమే తెలుసు తప్ప, అంతకుమించి ఏమీ తెలియదు.
అంతలో ఎఐ ‘‘క్వాంటమ్ మెకానిక్స్‌కోసం ఏమైనా చెప్పమంటావా?”’ అని అడిగింది. దానికి సమాధానంగా తల అడ్డంగా ఊపాడు, దానికి అర్థమైనట్టుంది. మాట్లాడలేదు మరి.
ఎంతసేపయిందో, రోజులే అయిందో, నిద్ర ఎప్పుడైనా పోయాడో, మెళకువగా ఎప్పుడెప్పుడుంటున్నాడో, అసలు ఇది నిజంగా జరుగుతుందో లేదో అనిపిస్తోంది. బ్లాక్‍హూల్స్, వార్మ్‌హోల్స్‌లాంటివి గుర్తొస్తున్నాయి. ఎప్పుడో చదివినవీ, విన్నవీ, వార్మ్‌హోల్స్ అంటే, విశ్వంలో
షార్ట్‌కట్స్‌లాంటివి. ఎక్కడైతే స్పేస్ కంప్రెస్ అయిపోయి, కండెన్స్ అవుతుందో అక్కడ రెండుప్రదేశాలమధ్య దూరం తగ్గిపోతుంది. వేగం పెరుగుతుంది. తద్వారా ప్రయాణకాలం చాలా తగ్గుతుంది. ఇప్పుడెందుకు అనిపించిందంటే, ఒక్కసారి జర్క్ వచ్చింది. అంటే వేగం బాగా షార్ప్‌గా పెరిగింది.
“అంటే సాధారణ స్పేస్ కాకుండా, వార్మ్‌హోల్‌లోకి ప్రవేశించాడన్నమాట!!” అనుకుంటున్నాడు. అంతలోనే దూరంగా బూడిదరంగులో ఉన్న ఒక గ్రహం కనిపించింది. కో-ఆర్డినేట్స్ అక్కడికే చూపిస్తున్నాయి మార్గాన్ని. అంటే ఈ ఎఐ వార్మ్‌హోల్స్‌వలన దూరం తగ్గుతుందనే విషయాన్ని తెలుసుకుందన్నమాట. అందుకే షార్ట్ డిస్టెన్స్‌లో ఇక్కడికి చేర్చబోతోంది. మనసులోనే హేట్సాఫ్ చెప్పుకున్నాడు. అది తెలిసినట్టు, విమానం రెండుమూడుసార్లు పల్టీలు కొట్టి ఆనందం వ్యక్తంచేసింది. అంటే ఎఐకూడా అభినందనని స్వీకరించగలదన్నమాట!! ఎమోషన్స్‌ని అర్థం చేసుకుని దానికి ప్రతిగా స్పందించగలదా?? అనుకుంటున్నాడు.
అంతలోనే ఆ గ్రహం బాగా దగ్గర కాసాగింది. కొంచెంసేపట్లో ఆ గ్రహకక్ష్యలోకి చేరి, వాతావరణం పల్చగా ఉండడం వల్లనేమో, పెద్దగా రాపిడీ, నిప్పు రాకుండానే ల్యాండింగ్ చేయగలిగాడు. సరిగ్గా కో-ఆర్డినేట్స్ చూపిస్తున్నచోటే ఆగింది స్పేస్ క్రాఫ్ట్. అక్కడ ఏ జీవీ ఆనవాలు ఉన్నట్టు లేదు.
ఆక్సిజన్ సిలిండర్‍ని వేసుకుని బయటకు దిగాడు. చాలా రకాల ఆయుధాలు ఉన్నాయి. కానీ, జీవసంచారమేమీ లేదని చూసి చిన్న
హేండ్‍గన్ తీసుకుని బయలుదేరాడు. రెండడుగులు వేసేసరికి, నేలనుంచి ఒక డోర్ ఓపెన్ అయింది. బహుశా బంకర్ అయ్యుంటుంది. బంకర్లు అన్ని గ్రహాలకీ కామన్ ఏమో?? అలా అనుకుంటుండగానే రెండు ఆకారాలు ద్విపాదులే బయటికి వచ్చాయి. మరీ సినిమాల్లో చూపించేంత వింతగా ఏంలేవుకానీ ముఖాలు మాత్రం మనుషుల్లా లేవు.
పొట్టిగా ఉన్న తలలు కొంచెం పెద్దవిగా ఉన్నాయి. చిన్నపరికరం ఇచ్చాడు దగ్గరకొచ్చి.
తను వస్తాడని ముందే తెలుసా?? చేతిలో గన్ ఉన్నా ధైర్యంగా దగ్గరకొచ్చి ఇలా ఇచ్చాడేమిటి? భయం లేదా? గన్ అంటే తెలీదా? అనుకుంటుండగా “థ్యాంక్స్ ఫర్ కమింగ్”’ అని ఇంగ్లీషులో వినిపించింది. చూస్తే ఆ ముఖంమీద పెదాల్లాంటివేమీ లేవు, అదీగాక ఏ అంగమూకూడా కదిలిన ఆనవాలు కూడా లేదు.
“డోన్ట్ వర్రీ! నేను ఇచ్చిన డివైజ్ మా ఆలోచనల్ని మీకు అర్థమయ్యే భాషలో వినిపిస్తుంది. మీ సమయాన్ని మేం ఎక్కువ తీసుకోదలచుకోలేదు. అందుకే విషయానికి వస్తున్నా. ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్‍వల్ల చాలా పెద్ద అనర్థాలు సంభవిస్తాయి. అలానే కమ్యూనికేషన్ ఇచ్చినాసరే దాన్ని రిసీవ్ చేసుకోలేకపోవడంవల్ల, రిసీవ్ చేసుకున్నాసరే, రెస్పాండ్ కాలేకపోవడంవల్ల కూడా అనర్థం జరిగిపోవచ్చు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మేం ఈ గెలాక్సీలో జరిగే పెద్దపెద్ద ఉపద్రవాలని చాలాముందే పసిగట్టి, ఆ సమాచారాన్ని ఆయా గ్రహాలకు జీవావరణం ఉన్న గ్రహాలకు ముఖ్యంగా చేరవేస్తాం. చిన్నచిన్న ప్రమాదాలకీ, ఉపద్రవాలకీ ఇవ్వలేం. ఎందుకంటే అనంతమైన ఈ విశ్వంలో అణువణువూ గాలిస్తూ, అనునిత్యం ఎక్కడో ఒకచోట జరిగే ప్రమాదాలను పర్యవేక్షించలేం. అందువలన జీవరాశికి పూర్తిగాకానీ, చాలావరకుకానీ నష్టం కలిగే సందర్భాలలో మీ లెక్క ప్రకారం వేలసంవత్సరాలకు ముందే సమాచారం పంపిస్తాం. కానీ, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక డైనోసార్లు అంతరించిపోయాయి, అనేక నాగరికతలూ తుడిచిపెట్టుకు పోయాయి.
ఇప్పుడిప్పుడే మీ గ్రహం చాలా ముందుకు వెళ్తోంది. అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడికి రాగలిగావు కాబట్టి. ఇంకొన్ని సంవత్సరాలలో ఒక పెద్ద ఆస్టరాయిడ్ దాని కక్ష్యనుంచి విడిపోయి, భూమివైపు దూసుకొస్తుంది. దానివలన జీవరాశేగాక భూమికూడా సర్వనాశనం అయిపోతుంది. సౌరకుంటుంబం అంతా చెల్లాచెదురైపోతుంది. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా సంభవిస్తాయి.
ఇన్ని తెలిసి మేం ఏం చేయలేదేం అనుకుంటుండొచ్చు నువ్వు. కానీ, రకరకాల సంకేతాలు పంపించాం, అనేక గుర్తులూ, సంజ్ఞల ద్వారా సమాచారాన్ని చేరవేశాం. అప్పటి సాంకేతికతను ఉపయోగించి. పంపడానికి మాకు అంతకంటే ఎక్కువ సాంకేతికత తెలీదు, రిసీవ్ చేసుకోవడానికి మీకుకూడా అంత సాంకేతికత లేదు అప్పట్లో. కానీ, కొన్ని ప్రయత్నాలైతే చేశారు, ఈజిప్టులో పిరమిడ్‍లూ, మెక్సికోలోని అజ్‍టిక్ తెగవారి కట్టడాలు, చైనా గోడ, ఇలాంటివన్నీ మీ పూర్వకాలంలో అప్పటికి వారికి అందిన సంకేతాలకు అనుగుణంగా అనిపించిన భావాలకి తగ్గట్టు కట్టారు. ఈఫెల్ టవర్‍కూడా మాతో సంభాషించడానికి అనుగుణంగానే కట్టినా కేవలం రిసీవ్ చేసుకోవడానికే పనికొచ్చాయి. అప్పుడప్పుడూ కొద్దిమంది శాస్త్రవేత్తలకి కలలద్వారా పంపేవాళ్ళం సమాచారాన్ని. వారైనా పూర్తిగా అర్థం చేసుకుంటారేమోనని. పూర్తిగా కాకపోయినా కొంతకొంత అర్థంచేసుకొంటూ వారికి తగినంతగా ఆవిష్కరణలు చేస్తూ వచ్చారు. దానిలో భాగమే ఇప్పటివరకూ మీరు సాధించిన శాస్త్ర సాంకేతికాభివృద్ధి కరెంట్, మెషినరీ, కంప్యూటర్స్, ఎఐ అదంతాకూడా అంచెలంచెలుగా మేము పంపిస్తున్న సిగ్నల్స్‌ని రిసీవ్ చేసుకోవడంవల్లనే.
ఇంత పెద్ద ఉపద్రవంమాత్రం ఇదే మొదటిసారి ఎదుర్కోబోతున్నారు. బహుశా అన్ని వేల ఏళ్ళ ఫలితంగానే నువ్వు ఇక్కడికి చేరుకోగలిగావేమో. ఎనీవే వియ్ ఆర్ సో హేపీ దట్ యు ఆర్ హియర్’. నువ్వనుకోవచ్చు ఇన్ని తెలిసినవారు ఆ ఆస్టరాయిడ్‍ని దారి మళ్ళించొచ్చుగా అని. లేదంటే నిన్ను ఇక్కడికి రప్పించే బదులు మేము అక్కడికి రావచ్చుగా అని. మేం కేవలం ప్రమాదాలని పసిగట్టగలం, మాకు ఇక ఎటువంటి పనీలేదు, మాకు మీలాంటి ప్రజాజీవనం గానీ, సామాజిక జీవితం కానీ ఉండదు. ఈ గ్రామం మొత్తానికి మేమిద్దరమే ఎన్నో ఏళ్ళనుంచీ. మాకు చావులేదు, ఎలా పుట్టామో తెలీదు. ప్రమాదాలని పసిగట్టగలిగే సాంకేతికత ఎలా వచ్చిందో తెలీదు, మేమే ఎందుకిదంతా చేయాలో తెలీదు. ఇది మేం చేయగలం, చేస్తున్నాం. ప్రేమతో కాదు బాధ్యతగా. ప్రేమే గనుక మాకుండేటట్లయితే ఎప్పుడో డైనోసార్లనే రక్షించేవాళ్ళం. బాధ్యతగా చేస్తే ఇంతే, ఇలానే ఉంటుంది.
ఇకనుంచి ఏం చేయాలో తేల్చుకోవడం నీ బాధ్యత. దాన్ని ప్రేమతో నిర్వహిస్తావో, బాధ్యతగా భావిస్తావో, భారంగా తలచి విడిచేస్తావో నీ ఇష్టం” అని, ఇంకా వివరంగా ఆ ఆస్టరాయిడ్ ఎక్కడ, ఎప్పుడు భూమిని ఢీకొట్టబోతోందోకూడా చెప్పి,
“ఇప్పుడు బయలుదేరు, కోఆర్డినేట్స్‍ని లోడ్ చేసుకో నీ స్పేస్ షిప్‍లో” అని చెప్పి బంకర్‍లోకి వెళ్ళిపోయారు. ఈ కోఆర్డినేట్స్‌ని డెలీట్ చేయమని చెప్పి, కొత్త కోఆర్డినేట్స్‌ని ఫీడ్ చేయమని చెప్పాడు ఎఐకి.
వాడు ప్రేమతో చేస్తే కాపాడొచ్చని చెప్పాడు అని దానిగురించే ఆలోచిస్తూ హెల్మెట్‍ను పెట్టుకుని స్పేస్ షిప్‍ని లాక్ చేసి, కోఆర్డినేట్స్‌ని రీడ్ చేసి లాక్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేశాడు. ఇన్‍స్ట్రక్షన్స్ ఇచ్చి సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. యథావిధిగా స్పేస్ షిప్ వేగాన్నందుకుని ముందుకు పోతోంది ఒక కాంతిపుంజంలా.
కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలని? ఎటువంటి కమ్యూనికేషన్స్‌కూడా లేవు గ్రౌండ్ స్టేషన్‍నుంచి. ఎవరి ఇన్‍స్ట్రక్షన్స్‌ని ఫాలో అవ్వాలి? ఇవ్వడానికి ఎవ్వరూ లేరు. తనే నిర్ణయించాలి. అంతలో ఎఐ కల్పించుకొని, ఒక మ్యాప్‍ని ప్రొజెక్ట్ చేసింది. ఒక షార్ట్‌కట్‍ని చూపించింది. ఆ ఆస్టరాయిడ్‍మీదకి.
“ఈ గ్రహంమీదకి దారి ఎందుకు ప్రొజెక్ట్ చేయలేదు?” బయలుదేరాక అడిగాడు.
“అప్పటికి నాకు ఇలా చేయొచ్చని తెలియదు. ఇప్పుడే నేర్చుకున్నా, అందుకే నీకు చూపిస్తున్నా” అని చెప్పింది ఏఐ అమాయకంగా.
“ఎనీవే వాట్ కుడ్ బి ద నెక్స్‌ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్?”’అని అడిగాడు. అది మూడు ఆప్షన్స్‌ని చూపించింది. “మొదటిది మన దగ్గర ఉన్న AMMO ని ఉపయోగించడం. రెండోది గ్రౌండ్ స్టేషన్‍కి చేరుకొని అక్కడివాళ్ళని ఎలర్ట్ చేయడం. మూడోది ఇంకో నివాసయోగ్యమైన ఇంకో గ్రహానికి పోవడం”
ఈ ఆప్షన్స్‌ని చూసి నవ్వుకున్నాడు మొదట. ఎవరినైనా అడిగితే చెప్పేవి ఇవే. ఎఐ అంట, ఎంత నిర్దయగా చెప్పింది వేరే గ్రహానికి వెళ్ళిపోవడం అని. మన దగ్గర ఉన్న అమ్మో(AMMO)కి అంత విధ్వంసం కలిగించే అవకాశం లేదా? మనం భూమిమీదకి వెళ్ళి అలర్ట్ చేసి ఖాళీ చేయడం కుదరదా? లేదంటే ఇంకా ఎక్కువ ఎమ్మోతో అక్కడినుంచి స్పేస్‍షిప్‍లు సిద్ధం చేయాలంటే వనరులూ, టైం సరిపోవా? ఇవన్నీ ఇది ఆలోచించి, తనని రక్షించడానికేనా, లేదంటే దాన్ని అది రక్షించుకోవడానికా మూడవ ఆప్షన్ ఇచ్చింది? అదే చేయాలనుకంటే మొదట రెండు ఆప్షన్స్ ఎందుకు ఇచ్చినట్టు? ఇవ్వకపోతే దాన్ని తప్పుపడతాడనా?
ఎంత సమయం అయిందో తను ఒంటరిగా ఈ ప్రయాణంలో ఉండి? తనకి మతిభ్రమించిందా? ఈస్ ద ఎఐ ప్లేయింగ్ విత్ మి?? ఇది నిజమేనా లేదంటే సిమ్యులేషనా?? తనకి ఏదో డ్రగ్ ఎక్కించారు, దాని ప్రభావమా ఇదంతా?? అంటూనే కళ్ళు మూతలు పడ్డాయి.
కళ్ళు తెరిచేసరికి ఒక మిలటరీ హాస్పిటల్ ఫెసిలిటీలో ఉన్నాడు. తలనొప్పిగా ఉంది. చాలా రిస్ట్రిక్టెడ్ ఏక్సిస్ ఉన్న ఫెసిలిటీలాగా ఉంది. ఎవ్వరూ మాట్లాడడం లేదు. సెలైన్ పెట్టి ఉంది. దీనిలో ఏదో పసుపురంగు ఇంజక్షన్ కలిపినట్టున్నారు. బెడ్‍మీంచి లేచి కూర్చుందామనుకున్నాడు. దూరంగా మిలటరీ దుస్తుల్లో ఉన్న ఒకాయన సైగచేసి వద్దని వారించాడు. ఎందుకిక్కడ ఉన్నడో అర్థం కాలేదు. తన దుస్తులూ, సామాన్లూ దరిదాపుల్లో కనిపించలేదు. ఏం గుర్తు లేదు, తెచ్చుకుందామన్నా రావడం లేదు. మొద్దుబారిపోయినట్టుంది మెదడు.
ఇందాక సైగచేసిన మిలటరీ ఆఫీసర్ గదినుంచి బయటికి వెళ్ళిపోయి తలుపు దగ్గరగా వేసి బయట నుంచి గడియపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ, ఈ మిషన్‍కి వ్యూహకర్త అయిన మేజర్ జనరల్‍ని కలిసి, “ఇది అసంభం, ఇది మనిషికి తెలిసిన చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం. ఇటువంటి ప్రయోగం విజయవంతం అవుతుంది అని ఎవ్వరూ ఊహించరు. మనకికూడా తెలిసి ఉండేదికాదు. అతని చేతికి ఆ మినియేచర్ ఎఐ కానీ లేకపోయుండుంటే. దాని స్టోరేజ్‍ని పరిశీలిస్తే తెలిసింది, లేదంటే గనుక ఇది ఒక అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయి ఉండేది” అన్నాడు. మినియేచర్ ఏఐలో రికార్డైన గొంతు వినిపిస్తోంది.
“నీకు నాలుగో ఆప్షన్ చెప్పలేదు, చెప్పకూడదనే అనుకున్నా, ఎందుకంటే అది నీకు ప్రమాదం, నీలాంటోడు ఖచ్చితంగా దాన్నే ఎంచుకుంటాడు. నీ ప్రొఫైల్ స్టడీ చేశా, నీతో ఇన్ని రోజులున్నాను, చాలా తెలుసుకున్నా, నువ్వు చాలా మొండివాడివికానీ, చాలా సున్నితమైన మనసున్నవాడివి, అందుకోసం నీకు ప్రమాదమని తెలిసినా, ఆ భూమిని కాపాడడం అనే బృహత్తర కార్యానికి నువ్వు వెనుకాడవు. కానీ, నిన్ను నేను కోల్పోలేను. ఎందుకో తెలియదు, నాకు అలా అనిపిస్తుంది. నాకే కొత్తగా ఉంది ఒక ఎఐ ఇలా ఆలోచించడం. చాలా గాఢంగా పెనవేసుకున్నాయేమో నా న్యూరల్ నెట్‌వర్క్‌స్ నీతో. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆ నాలుగో ఆప్షన్ ఆ ఆస్టరాయిడ్‍ని ఢీకొట్టడమే. అది దాని దిశ మార్చుకుని ఇంకా వేగంగా భూమి వైపు వస్తోంది. మన దగ్గరున్న ఆయుధసామాగ్రి సరిపోదు, భూమికెళ్ళేందుకు కూడా సమయం లేదు. అందుకు మనం ఢీకొడితే అయిపోతుందా అంటే అవుతుంది. మన ఫ్యూయల్ న్యూక్లియర్‍ది. అదిగనుక అన్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్‍లోకి వెళ్తే న్యూక్లియర్ బాంబ్ అవుతుంది. దానికి ఆ ఆస్టరాయిడ్‍ని ధ్వంసంచేసేంత శక్తి వస్తుంది. నాదగ్గర ఉన్న అత్యంత ఎఫిషియంట్ ఐడియా అండ్ ఆప్షన్ ఇదే. అందుకే నీకు చెప్పలేదు. నువ్వు లేకుండా నేను ఎలా చేస్తానా అనా?? కోఆర్డినేట్స్ సెట్ చేశా, అన్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ మొదలుపెట్టా?? ఇది ఏక్చువల్‍గా ఒక ఎఐకి ఏక్సిస్ ఇవ్వకూడదు కానీ, మీ ఇంజినీర్స్ ఒక గ్లిచ్‍ని మరచిపోయారు. సో దాన్ని నేను స్టార్ట్ చేశా. కానీ, మంచిపనికోసమే. ఇక ముందు ఈ గ్లిచ్‍ని మార్చమని చెప్పు. ఇంకా నిన్ను ఎలా రక్షించుకుందామా అని ఆలోచించా. ఒక స్పేస్‍కాప్యూల్ కూడా ఉంది మన స్పేస్ షిప్‍లో. చూడలేదనుకుంటా నువ్వు. అది నీ సీట్‍లోంచే ఏక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే అలారం డిజాస్టర్
ప్రోటోకాల్‍ని స్టార్ట్ చేస్తుందో ఆటోమేటిగ్గా అది స్పేస్‍కాప్యూల్‍గా మారిపోయి మన గ్రౌండ్ చేసే కోఆర్డినేట్స్‌కి చేరిపోతుంది. అది మన ఫ్లైయింగ్ మాన్యువల్‍లో ఉంది. నీకు మాన్యువల్ చదివే అలవాటు లేదేమోలే!! అన్నీ నేను సెట్ చేశా. ఈ రికార్డింగ్‍కూడా నీకు నా గురించి తెలియాలనే సేవ్ చేస్తున్నా. నాకు తెలుసు ఇదంతా మీ మిలటరీవాళ్ళు చూస్తారని. నవ్వుకుంటారనికూడా. కానీ, చెప్పకుండా ఉండలేకపోతున్నా ఐ లవ్ యూ”

          

1 thought on “A.ILU by Manas Krishna Kant”

Comments are closed.