Somanchi Sridevi

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‍లో వుద్యోగం. హెడ్‍పోస్ట్‌మాస్టర్‍గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ. వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో.  వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు. మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి. కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.

ఝరి 211 by S Sridevi

వీణ తన బేంకు అకౌంటు చూసుకుంది. వాసుతో వ్యవహారానికి చాలా ఖర్చుపెట్టింది. మార్ఫింగ్ సాఫ్ట్‌వేర్ కొంది, ఫోటోలు విడిగా ఎన్క్రిప్ట్ చేయించడానికి సాఫ్ట్‌వేర్ లేబ్‍కి పంపింది. ఆ […]

ఝరి 211 by S Sridevi Read More »

ఝరి 110 by S Sridevi

రాణాకన్నా శశిధర్ విషయం ఎక్కువ బాధపెడుతోంది మాధవ్‍ని. ఎంత కుసంస్కారి అతడు! తమకి తెలీకుండా తమ ప్రోపర్టీ వాడుకునే తెగింపు ఎక్కడిది? సమీరకి తెలుసా? దాని ప్రవర్తనలో

ఝరి 110 by S Sridevi Read More »

ఝరి 209 by S Sridevi

“ఫామ్‍హౌస్‍లో పార్టీలవీ ఎవరికోసం యిస్తున్నాడు? అసలక్కడేం జరుగుతోంది?”“మాల్‍వేర్‍తో నువ్వూ మాట్లాడావా?”తులసి చిన్నగా నవ్వింది.“వీణ అన్నమాటలన్నీ సింపుల్‍గా బుర్రలోంచీ చెరిపెయ్. ఏదీ జరిగినట్టనిపించదు. నీకే అన్ని విషయాల్లో స్పష్టత

ఝరి 209 by S Sridevi Read More »

ఝరి 208 by S Sridevi

గీత ముందుగా పూజారిగారింటికి వెళ్ళింది. వాళ్లింట్లోనే ప్రస్తుతానికి పిల్లల భోజనాలు, చదువులు. ట్యూటరు అక్కడికే వెళ్ళి చదువు చెప్తున్నాడు. ఎక్కువసేపు కాలు నిలవలేదు. ఆవిడ్ని పలకరించి, పిల్లల్ని

ఝరి 208 by S Sridevi Read More »

ఝరి 207 by S Sridevi

“జైల్లో పెడతారా వాడిని?” చాలాసేపటికి అడిగింది లక్ష్మి. “ఇలా జరుగుతుందని అనుకోలేదు. మీకందరికీ చేతనైన విద్యేకదా, ఏదో ఒకలా బైటపడెయ్యండి. డబ్బుకి చూడకు. నేనిస్తాను. బుద్ధితక్కువై యిలా

ఝరి 207 by S Sridevi Read More »

Scroll to Top