రాధకు నీవేర ప్రాణం by Pathy Muralidhara Sharama

  1. ఏం చేయాలి? by Sailaja Kallakuri
  2. డాక్టరుగారి భార్య by Pati Muralidhara Sharma
  3. పదవే చెల్లీ – పదరా అన్నా by Mangu Krishna Kumari
  4. గురుదక్షిణ by Pati Muralidhara Sharma
  5. మృతజీవుడు by Ramu Kola
  6. అత్తారింట్లో దారేదీ by Pathy Muralidhara Sharma
  7. తొణికిన స్వర్గం!!!… Translation by Savitri Ramanarao
  8. ప్రేమంటే ఇదేనా? by Pathy Muralidhara Sharma
  9. ఆనందం పరమానందం by Pathy Muralidhara Sharma
  10. మాతృదేవోభవ! Translation by Savitri Ramanarao
  11. రాధకు నీవేర ప్రాణం by Pathy Muralidhara Sharama
  12. ఏం దానం? by Mangu Krishna Kumari
  13. బందీ! నిన్నెవ్వరు కట్టేసారూ!! by Savitri Ramanarao
  14. కోటి‌విద్యలూ… by Mangu Krishna Kumari
  15. గొప్పవారింటి పెళ్ళి by Mangu Krishna Kumari
  16. స్వేచ్ఛ అంటే… by Savitri Ramanarao
  17. జ్ఞాననేత్రం by Rama Sandilya
  18. ధైర్యే సాహసే లక్ష్మీ translation by Savitri Ramanarao

రాధ వారం రోజులుగా చూడని క్యాలెండరు వైపు చూసింది బితుకు బితుకుగా. తన పాలిట శత్రువైన తేదీ రానే వచ్చేసింది. మార్చ్ మూడు. భర్త తిరిగి వెళ్ళిపోయే రోజు.
రాధ భర్త కృష్ణమూర్తిని ప్రమోషన్‍మీద బెంగుళూరు వేసేరు. రాధ పిల్లల చదువుల మూలంగా విశాఖపట్నంలోనే ఉండిపోయింది. కృష్ణమూర్తి బెంగుళూరు వెళ్లి జాయిన్ అయి మూడునెలల తర్వాత వారం రోజులు సెలవు మీద వచ్చేడు. రాధ ఇన్నాళ్ళూ భరించిన ఒంటరితనం ఈ వారంరోజుల్లో మర్చిపోయింది. గతించిన మూడునెలల్లో నెలలు తరగడం లేదని క్యాలెండర్ పేజీలు చింపేయాలనిపించిన రాధకు ఈ వారం రోజులూ టేబుల్ క్యాలెండర్లో తేదీ మార్చాలన్నదే గుర్తుకు రాలేదు.
అప్పుడు కాలం వేగంగా గడిచిపోవాలని కాంక్ష అయితే ఇప్పుడు కాలం ఆగిపోతే బాగుండునని ఆకాంక్ష. గడియారంలో ముళ్ళు కదిలిపోతున్నాయని ఆరాటం. ట్రైన్‍కు టైం అయిపోతుందని బెంగ. ఆయనకు స్వాగతం పలకడానికి వెళ్ళినప్పుడు తన మనసులాగే ఆ స్టేషన్ కళకళలాడింది. అదే స్టేషన్ ఇప్పుడు వీడ్కోలు చెప్పడానికి వెళ్ళినప్పుడు వెలవెలబోయింది. ఆరోజు ట్రైన్ లేటని నిరాశ. ఈరోజు ట్రైన్ లేటయితే బాగుండునని ఆశ. ఆ రోజు ట్రైన్ వస్తున్నట్లు స్టేషన్‍లో అనౌన్స్మెంట్ ఇస్తే గంతులేసింది.ఈరోజు అనౌన్స్‌మెంట్ ఇస్తుంటే కంట నీరు నిండింది పాపం. ఆరోజు తమ ఇద్దర్నీ కలిపిన ట్రైన్ ఆత్మబంధువులు కొంతమందిని విడదీసినా, ఈరోజు విడదీస్తున్నది పాషాణహృదయం కల కఠినాత్మురాలిలా. మరి కొంతమందిని కలుపుతున్నాసరే. ఆనాడు తన కంఠం ఆనందంతో రాగాలు తీసింది. ఈనాడు అదే కంఠం ఆవేదనతో మూగబోయింది. ఆనాడు స్వాగతం పలకడానికి ట్రైన్‍ని కనుచూపుమేరనుండీ చూస్తూ వచ్చింది సంతోషంతో. ఈనాడు వీడ్కోలు చెప్తూ ట్రైన్ కనుమరుగయేవరకూ చేతులు ఊపుతూనే ఉంది విచారంగా. ఆనాడూ, ఈనాడూ అదే వ్యక్తులు, అదే రైల్వేస్టేషన్, అదే స్థలం. కానీ సందర్భం వేరు. అది గ్రహించేది మనసొక్కటే.
రాధ ఇంటికొచ్చిందిగానీ అన్యమనస్కంగానే ఉంది. పిల్లలంటే ప్రాణం పెట్టేదల్లా వాళ్ళేదో అడిగితే వాళ్ళమీద చిరాకు పడింది. తిన్నగా వెళ్లి బెడ్రూమ్‍లో లైటయినా వెయ్యకుండా పక్కమీద వాలిపోయింది బరువెక్కిన మనసుతో.
“ఏమండీ! అక్కడకు వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తారు కదూ! ప్లీజ్ మర్చిపోకండి. ఏమండీ! మిమ్మల్నే!…”
రాధ మాటలకు ఉలిక్కిపడి లేచేడు కృష్ణమూర్తి. రాధ నిద్రపోతోంది. నెమ్మదిగా తట్టి అడిగాడు. “ఎవర్నీ, ఫోన్ చెయ్యమంటున్నావ్?””
“ఇంకెవర్ని? మిమ్మల్నే!”” నెమ్మదిగా కళ్ళు తెరిచిచూసింది. “”ఏమండీ! మీరు…. బెంగుళూరు వెళ్ళలేదా?””
“ఎందుకు వెళ్ళలేదూ? వెళ్ళేను నీ కలలో. వీడ్కోలు చెప్పేసేవు కదా!””
“ఒహ్హో! ! అన్నట్టు మీ ప్రయాణం రేపు కదా! “కలలోనూ, ఇలలోనూ కూడా మీరేగా?” హాయిగా ఊపిరి పీల్చుకుని గువ్వలా ఒదిగిపోయింది కృష్ణమూర్తి ఒడిలో సిగ్గులమొగ్గయి.
( తెలుగువేదిక” అంతర్జాలపక్ష పత్రిక 15.8.2016లో ప్రచురితమైనది)