Somanchi Sridevi

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‍లో వుద్యోగం. హెడ్‍పోస్ట్‌మాస్టర్‍గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ. వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో.  వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు. మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి. కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.

జిల్లావైద్యుడు (The District Doctor)- 1 Translation by S Sridevi

ప్రతిమనిషికీ ఒక ప్రేమకథ వుంటుంది. అది విఫలమో సఫలమో ఔతుంది. రెండిటిలో ఏది జరిగినా అతనిమీద దాని ప్రభావం వుంటుంది.

జిల్లావైద్యుడు (The District Doctor)- 1 Translation by S Sridevi Read More »

నీలినక్షత్రం 14 by S Sridevi

అక్కడ సౌరకుటుంబంలోని మూడో గ్రహంమీద నాగరికత నశించింది. మీరావాళ్లు వచ్చేసాక భూతాపం విపరీతంగా పెరిగి, మంచంతా కరిగి, హిమానీనదాలని చేరి, సముద్రమట్టాన్ని పెంచింది.

నీలినక్షత్రం 14 by S Sridevi Read More »

నీలినక్షత్రం – 13 by S Sridevi

ముందు హర్ష చనిపోయాడు. అతని మరణం మీరాని చాలా కదిలించింది. నలుగురు కలిసి ఇక్కడికి వచ్చారు. ఒక్కొక్కరుగా మిగిలిన ముగ్గురూ తరలిపోయారు.

నీలినక్షత్రం – 13 by S Sridevi Read More »

నీలినక్షత్రం – 12 by S Sridevi

“నువ్వలా ఏడవకు మీరా! నా అసమర్ధత ఎత్తి చూపిస్తున్నట్టుంది. ఈ చీకట్లో వాడికోసం ఎక్కడని వెతకను? మనం ఉన్నామన్న ధైర్యంతో వెళ్ళిపోయింది అవంతి. మనం ఈ పిల్లలని కాపాడలేక పోతున్నాము” అన్నాడు తనూ ఏడుస్తూ.

నీలినక్షత్రం – 12 by S Sridevi Read More »

నీలినక్షత్రం – 11 by S Sridevi

మేము వచ్చిన స్పేస్‍షిప్ బొమ్మ, సైన్సుకి సంబందించిన సూత్రాలు, స్పేస్ కి సంబందించిన రహస్యాలు.. అన్నీ కుడ్యచిత్రాలుగా మార్చిపారేశాడు గౌతమ్.

నీలినక్షత్రం – 11 by S Sridevi Read More »

నీలినక్షత్రం – 9 by S Sridevi

విభ్రాంతికరమైన రెండు వాస్తవాలు. ఈ గ్రహానికి రెండు చందమామలు. ఒకటి దగ్గరగా. ఇంకొకటి కొంచెం దూరంగా. రెండు వరుసల్లో పక్కపక్కనే ఉన్నట్టు కనిపిస్తూ.

నీలినక్షత్రం – 9 by S Sridevi Read More »

Scroll to Top