నీలినక్షత్రం -1 by S Sridevi

  1. నీలినక్షత్రం -1 by S Sridevi
  2. నీలినక్షత్రం – 2 by S Sridevi
  3. నీలినక్షత్రం – 3 by S Sridevi
  4. నీలినక్షత్రం – 4 by S Sridevi
  5. నీలినక్షత్రం – 5 by S Sridevi
  6. నీలినక్షత్రం – 6 by S Sridevi
  7. నీలినక్షత్రం – 7 by S Sridevi
  8. నీలినక్షత్రం – 8 by S Sridevi
  9. నీలినక్షత్రం – 9 by S Sridevi
  10. నీలినక్షత్రం 10 by S Sridevi
  11. నీలినక్షత్రం – 11 by S Sridevi
  12. నీలినక్షత్రం – 12 by S Sridevi
  13. నీలినక్షత్రం – 13 by S Sridevi
  14. నీలినక్షత్రం 14 by S Sridevi
  15. నీలినక్షత్రం – 15 by S Sridevi

క్రీస్తుశకం 2006లో ప్లూటో తన గ్రహస్థాయిని కోల్పోయింది. సౌరకుటుంబంలో తొమ్మిది వుండే గ్రహాలు ఎనిమిదయాయి. సరిగ్గా యాభైసంవత్సరాల తర్వాత ఒక అమావస్యరాత్రి కొన్ని తెల్లగానూ, ఇంకొన్ని పసుప్పచ్చగానూ మెరుస్తున్న నక్షత్రాలమధ్య వీనస్‍కి కొంచెం దూరంగా ఒక నీలినక్షత్రం కొద్ది క్షణాలపాటు మెరిసి మాయమైంది.
నీలినక్షత్రం!
చంద్రుడిమీంచీ చూసినప్పుడు భూమికూడా అలాగే కనిపిస్తుంది. భూమిమీదగల అపారమైన జలరాశిమీద సూర్యకాంతి పడి పరావర్తనం చెందటంవలన అలా జరుగుతుంది. వీనస్ పక్కన వున్నది గ్రహమా? సౌరకుటుంబంలోకి కొత్తగా వచ్చి చేరిందా? దానిమీద నీళ్ళున్నాయా? ఖగోళశాస్త్రప్రపంచం వూపిరి బిగబట్టింది. అందర్లో దిగ్భ్రాంతి. ఐతే ఎవరూ పైకనలేదు. గమనించనట్టే వూరుకున్నారు. దానికి చాలా కారణాలున్నాయి.
లక్షల సంవత్సరాల మానవప్రస్థానంలో రెండు పొరపాట్లు జరిగాయి. మొదటిది చక్రాన్ని కనిపెట్టడం, రెండవది ప్లాస్టిక్ తయారుచెయ్యడం. ఈ రెండిటికీ భారీగా మూల్యం చెల్లించవలసిన పరిస్థితి వచ్చింది.
యంత్రాన్ని కనిపెట్టాక దాన్ని నడిపించడంకోసం భూమి అడుగుపొరల్లో దాగి వున్న ఇంధనాన్ని తీసి వాతావరణమంతా కార్బన్‍మోనాక్సైడ్,
కార్బన్‍డయాక్సైడ్‍లతో నింపుకున్నారు. ప్లాస్టిక్ కనిపెట్టాకైతే భూగోళం ప్లాస్టిక్ డంపింగ్‍యార్డ్‌గా మారిపోయింది. దానికి నాశనం లేదు. ఇది సమస్యకి ఒక పక్క.
మరీవైపు అంటార్కిటికా దగ్గిర ఓజోను పొరకి పడిన చిల్లు విస్తరిస్తోంది. గ్రీన్ హౌస్ ఎఫెక్టువలన భూమ్మీది వుష్ణోగ్రత బాగా పెరిగింది. గ్లేషియర్సన్నీ కరిగి ముంచెత్తే రోజు ఎంతో దూరం లేదనిపిస్తోంది. ఏ దేశానికి ఆ దేశం అణ్వస్త్రాలని తయారుచేసి దాచుకుంటోంది. ఏ క్షణాన ఎవరినుంచీ ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో తెలీడంలేదు. భయం అంచుని వుంది ప్రపంచం. హీరోషిమా నాగసాకీ వుదంతాలు ఆ దేశానికే పరిమితమయాయి. కంప్యూటర్లనీ , ఎయిర్ కండీషనర్లనీ కనిపెట్టినవాళ్ళూ , వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నవాళ్ళూ కాలగర్భంలో కలిసిపోగా వాటి విషఫలాలుమాత్రం మిగిలాయి.
ఇప్పుడింక ప్రత్యామ్నాయ గ్రహాలకోసం వెతుకులాట మొదలైంది. చంద్రుడిమీద స్పేస్ సిటీ నిర్మించింది నాసా. అదొక కృత్రిమమైన వాతావరణం. కృత్రిమంగా బ్రతకటం. భూమితో అనుబంధం సరిగా వున్నప్పుడే అది సరిగా వుంటుంది. తాత్కాలికమైనది. భారత ఆస్ట్రనామికల్ సొసైటీ – బాస్‍కి కృత్రిమంగా బ్రతకడమనేది నచ్చలేదు. అందుకని చంద్రుడిమీద తన హద్దురాళ్ళని పాతలేదు. ఎవరికీ తెలియకుండా తన ప్రయత్నాలు తను చేసుకుపోతోంది. పురాణాలనీ ఇతిహాసాలనీ నిజమని నమ్మే ఒక వర్గం వాటిని నిరూపించడానికి బలమైన ప్రయత్నాలు చేస్తూ అనేక వాస్తవాలని సాక్ష్యాధారాలతో నిరూపించింది. వాటి ఆధారంగా సైన్సు పునర్నిర్మితమైంది. కానీ అప్పటికే చాలా ఆలశ్యమైంది.

వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకోవడానికి ఆ వంతెనమీదికి వచ్చారు. చాలా పెద్ద వంతెన. పాతకాలంనాటిది. దానికింద పెద్ద నది ప్రవహిస్తుండేది. ఒకప్పుడు. ఇప్పుడది చిన్న నీటిచెలమగా కుదించుకుపోయింది. దానిమీది ఆధిపత్యంకోసం ఇద్దరూ పోరాడుతున్నారు. సయోధ్యగా వుండి దాన్ని పంచుకోవచ్చు. ఐతే భూమ్మీద ప్రేమ అనేది చచ్చిపోయి చాలా ఏళ్ళైంది. ఇప్పుడు మిగిలున్నది నిప్పులుగక్కే విద్వేషం మాత్రమే.
వెనక్కి దాచుకున్న అతని చేతిలో చిన్న కత్తి వుంది. ఆమె తన గోళ్ళలో విషాన్ని నింపుకుంది. వాటితో అతన్ని కొంచెం గాయపరిస్తే చాలు, రోగనిరోధకవ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న అతను సునాయాసంగా చనిపోతాడు. ఆకలిదప్పులకి కృంగి కృశించిన ఆమె దేహాన్ని ఒక్క పోటు పొడిచినా సరే, అదామె ప్రాణాన్ని తీస్తుంది.
ఇద్దరూ ఎదురెదురుగా నడుస్తూ దగ్గిరౌతున్నారు. పౌర్ణమినాటి రాత్రి. చంద్రుడు చాలా ప్రకాశవంతంగా వున్నాడు. వేడెక్కిన వాతావరణపు పొరల్లోంచీ ప్రయాణించిన వెన్నెల వేడిగా వుంది. సహజవిరుద్ధమైన ఆ వేడి వాళ్ళని బాగా వుద్రేకపరుస్తోంది. అంతే! ఒక్క అంగలో ఒకేసారి ముందుకి దూకి కలియబడ్డారు. కొద్ది నిముషాలు గడిచాక చెరోవైపూ కూలారు.
ఆ దృశ్యాలన్నిటినీ శాటిలైట్ కనెక్షన్ ద్వారా చూసిన తర్వాత బాస్ వ్యోమనౌక ఒకటి అంతరిక్షంలోకి బయల్దేరింది. దానికి ఎలాంటి దిశానిర్దేశనం లేదు. భూమ్మీద అంతరించిపోతున్న మానవజాతిని పునరుజ్జీవింపజేయడానికి సౌరకుటుంబపు పరిధిలో ఒకసారి తారలా మెరిసి మాయమైన నీలినక్షత్రాన్ని వెతకడంకోసం భూకక్ష్యలోంచీ దూసుకు వెళ్తోంది. అందులో నలుగురు వ్యోమగాములున్నారు. ఇద్దరు స్త్రీలు, ఇద్దరు పురుషులు. కంప్యూటర్ స్క్రీన్ మీద వారికోసం ఒక మెసేజి కనిపిస్తోంది. అది బాస్ నుంచీ వాళ్ళు అందుకున్న ఆఖరి సందేశం- స్నేహితులారా, వీడ్కోలు…ఎప్పటికీ.
ప్రతి వీడ్కోలూ ఇంకెక్కడో స్వాగతంగా రూపాంతరం చెంది నిరీక్షణగీతం పాడుతుంటుంది. దాన్ని పంపినవాళ్ళు కొందరు శాస్త్రవేత్తలు. వాళ్ళంతా ఇప్పుడు ప్రయోగశాలల్లో బందీలు. భూమ్మీది వాతావరణం మొత్తం తుడిచిపెట్టుకుపోయాకకూడా మనిషి బ్రతకడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించుకుని అందులో బతుకుతున్నారు. ఇంకొందరు హైబర్నేషన్లోకి వెళ్ళారు. మనుషుల్లో హైబర్నేషన్ అనేది జన్యువిప్లవ ఫలితం. కొన్ని జన్యువులని స్తబ్దపరిస్తే సాధ్యపడింది. శాస్త్రీయ ప్రగతికి పర్యవసానంగా ఒక ఖగోళ అద్భుతాన్ని మాయంచేసాక కూడా ఇంకొకటి అలాంటిది వుండకపోతుందా అనే ఆశతో … అది దొరికేదాకా బ్రతికి వుండాలని….
సందేశాన్ని అందుకున్నాక వ్యోమనౌకకి బాస్‍తోనే కాదు, భారతదేశంతోనే కాదు, భూగోళంతోనే సంబంధం దాదాపుగా తెగిపోయింది. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఒక సంవత్సరం. అలాంటి ఇరవై సాపేక్ష సంవత్సరాలు గడపటానికి వసతి ఆ నౌకలో వుంది. ఇంధనసమస్య లేదు. విశ్వం అంతటా వ్యాపించి వుండే రేడియేషన్ని వినియోగించుకునే టెక్నాలజీతో తయారైంది. ఈలోగా వాళ్ళు మరో గ్రహాన్ని వెతకాలి. లేకపోతే లక్షల సంవత్సరాల మానవజాతి వునికికి చరమగీతం పాడుతూ అనంతవిశ్వంలో తమ వునికిని కోల్పోవాలి.

రాత్రి పదకొండుగంటల సమయం. నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని తదేకంగా చూస్తున్నాడు అభిజిత్. అలాంటి దృశ్యాన్ని చూసినప్పుడు అతనికి ఒకేసారి పరస్పరవిరుద్ధమైన వుద్వేగాలు కలుగుతాయి. మొదట గొప్ప వుత్తేజం కలుగుతుంది. ఆ వెంటనే ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. అన్ని నక్షత్రాలమధ్య నీలిరంగులో మెరిసే నక్షత్రం ఒకటి అతన్ని చాలా ప్రలోభపెడుతుంది. అక్కడికి వెళ్ళాలనే తీవ్రమైన కోరిక కలుగుతుంది. తన చుట్టూ వున్న ప్రపంచం , భౌతిక విలువలు… అన్నీ అబద్ధమనిపిస్తాయి.
తనెవరు? మనిషిగా ఎలా ఆవిర్భవించగలిగాడు? తానొక శక్తా, పదార్ధమా? రెండిటి మిశ్రమమా? ఐతే ఏది దేన్ని నియంత్రిస్తోంది? మనిషిగా పుట్టకముందు తనేమిటి? తనుగా బైటికి కనిపిస్తున్నదేమిటి? తనలో వున్నదేమిటి? తననిలా చేసిందేమిటి? తనిలాగే ఎందుకున్నాడు. ఇంకొకలా ఎందుకు లేడు? అసలు మనిషేమిటి? ఎవరు ఆద్యులు మనిషిగా మారటానికి? తనకి భాగస్వామ్యం వున్న ఈ సృష్టేమిటి? దాన్ని నియంత్రించేదెవరు? ఈ ప్రశ్నలన్నిటి వెనుకా అతని మనసు పరుగులు తీస్తుంటుంది.
నీలినక్షత్రాన్ని అన్వేషించాలనే కోరిక ఇంకా బలంగా కలుగుతుంది అతన్లో ఈ ప్రశ్నల తర్వాత. కానీ అది తీరే కోరిక కాదని తెలుసు. నిజానికి నీలి కాంతులని వెదజల్లే ఆ ఖగోళపదార్ధం నక్షత్రం కాదు. ఒక గ్రహం. ప్లానెట్ ఎక్స్ అని పిలుస్తారు దాన్ని. అతన్ని ఆకర్షించినట్టే ఇంకా ఎందర్నో ఆకర్షించింది. దాన్నిగురించి ఎన్నో ప్రయోగాలు జరిగాయి. తాముండే సౌరకుటుంబానికి చెందిన మూడోగ్రహం. ఒక వుపగ్రహంతో కలిసి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. దానిమీదికి వెళ్ళాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒక్క వుపగ్రహంమాత్రం దిగి కొద్దిసేపు వుండగలిగింది. కొన్ని ఫోటోలు, వివరాలు పంపింది. ఆ తర్వాత పేలిపోయింది. దొరికిన ఆధారాలతో కొన్ని అంచనాలు…
కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్‍లాంటి విషవాయువులతో కూడిన గాలులు విపరీతమైన వేగంతో వీస్తుంటాయి. ఉష్ణోగ్రత సగటున వంద డిగ్రీలు దాటి వుండవచ్చు. కొంత కరుగుతున్న మంచుప్రాంతం. కొన్ని రగులుతున్న, పేలుతున్న అగ్నిపర్వతాలు. మిగిలినదంతా అపారమైన , నిరుపయోగమైన జలరాశి. మంచుయుగానికి ప్రస్థానిస్తున్నట్టు అందీ అందని సూచనలు. అక్కడ మనుషులున్నారా? జీవం వుందా? నీరున్నప్పుడు జీవం ఏదో ఒక రూపంలో వుండాలి. ఉంటే? అది ఏ స్థాయిలో వుంది? మనుషులున్నారా? ఎలా వుంటారు వాళ్ళు? అలాంటి వాతావరణాన్ని ఎలా తట్టుకుంటున్నారు? వాళ్ళనెలా కలుసుకోవడం? ఎన్నో ప్రశ్నలు.
పురాణాల్లో ఆ గ్రహాన్ని గురించిన వివరాలున్నాయి. దానిమీద మనుషులుండేవారనీ, చేసిన పాపాల కారణంగా వాళ్ళు అక్కడినుంచీ నెట్టివేయబడ్డారనీ వుంది వాటిలో. అవ్వనాతి, అరుసు, గావు, ఇమిరు అనే దేవతలు మనుషుల్ని మళ్ళీ వుద్ధరించారని రాసారు. వాళ్ళలో అవ్వనాతికి దేవాలయాలున్నాయి. ఆ గుళ్ళలో మిగిలినవాళ్ళ విగ్రహాలుకూడా వుంటాయి. అవనతేశ్వరం అనే ప్రదేశంలో ఆ విగ్రహాల మూలాలున్నాయి. మిగిలినవన్నీ నకళ్ళు. వాటిని చూసి చెక్కినవి. ఐతే ఈ పురాణాలనెవరూ ప్రామాణికంగా తీసుకోరు. కొన్ని ఆదిమజాతుల సాంప్రదాయగానాల్లోకూడా వీళ్ళగురించిన ప్రస్తావన వుంది. వివిధ కథలు ప్రచారంలో వున్నాయి. అభిజిత్ వాటిని మథించాడు. ఎక్కడో ఏవో లింక్స్ మిస్సయ్యాయనిపిస్తుంది అతనికి.
అతని ఆలోచనలని ఆపుతూ ఫోన్ మ్రోగింది. ఎత్తితే శ్రీరాం.
“వాళ్ళా ఛిప్‍ని మనకివ్వడానికి వప్పుకున్నారు” శ్రీరాం గొంతులో సంభ్రమం.
“నువ్వు సరిగ్గా చూసావా?” అభిజిత్ ఆతృతగా అడిగాడు.
“అదొక్కటే కాదు. దాదాపుగా డికే అయ్యి భూమిలో కలవటానికి సిద్ధంగా వున్న కొన్ని ప్లాస్టిక్ వస్తువులు, ఒక పారాచుట్ లాంటిది, ఇంకా ఏవేవో దొరికాయట” చెప్పాడు శ్రీరాం.
ఆర్కియలాజికల్ టీం ఒక పురాతన గుహని కనుగొంది. అందులో ఆదిమానవులు వుండిన ఆధారాలు దొరికాయి. దాని గోడల నిండా వింతవింత బొమ్మలు, ఏవో రాతలు చెక్కబడి వున్నాయి. వాటికి వాడిన రంగుల సేంపుల్స్ తీసుకున్నారు. ఇంకా వెతుకుతూ తవ్వకాలు జరుపుతుంటే ఈ వస్తువులు దొరికాయి. కొన్ని ఫాజిల్స్ కూడా. వాటితోపాటు కంప్యూటర్ చిప్‍లాంటి వస్తువు బైటపడింది. ప్లాస్టిక్‍తో తయారైన ఆ వస్తువు రాళ్ళమధ్య సందులో చిన్న వెదర్‍ప్రూఫ్ కాప్స్యూల్లో చాలా జాగ్రత్తగా వుంచబడింది. ఏమాత్రం చెడిపోని స్థితిలో వుంది. లేబ్‍లో కొద్దిగా ట్రీట్ చెయ్యగానే అందర్లో సంభ్రమం , సందిగ్ధం.
“అవన్నీ అక్కడికెలా వచ్చాయి? ప్లాస్టిక్ డికే అంటే కనీసం పదివేల సంవత్సరాలు. అంతకంటే ఎక్కువేగానీ తక్కువకాదు. ..లక్షదాకా ” విస్మయంగా అన్నాడు అభిజిత్.
“మిగిలినవాటన్నిటినీ లేబ్ స్టడీకి పంపించారు. రేడియోకార్బన్‍డేటింగ్‍లో కూడా అలానే రిజల్ట్ వచ్చిందట. ఎవరూ నమ్మ;లేకపోతున్నారు. ఈ చిప్ ఒక్కటీ నా దగ్గిర వుంది”
“అది కంప్యూటర్ చిపేనా?” మరోసారి అభిజిత్ అడిగాడు.
“నాకైతే అలాగే అనిపిస్తోంది. నీదగ్గిరున్న బ్రహ్మరాక్షసైతే దాన్ని జీర్ణించుకోగలుగుతుంది” అన్నాడు శ్రీరాం. అతను బ్రహ్మరాక్షసి అన్నది అభిజిత్ దగ్గిరున్న కంప్యూటర్ని. దాని మెమరీ, స్పీడు, ఫీచర్సు, దాని క్లయంట్స్ సూపర్ కంప్యూటర్‍కి ఏమాత్రం తీసిపోవు. అభిజిత్ స్వయంగా దాన్ని ఎన్నోవిధాల అప్‍గ్రేడ్ చేసుకున్నాడు.
“అంత పురాతనమైన గుహలో చిప్ దొరకడమేమిటి? గమ్మత్తుగా లేదూ?”
“నేనక్కడికి రానా?”
“ఇంత రాత్రా?”
“జీవని లేబ్‍‍లోనే వుండిపోయింది. ఈ రోజుకి రాదట. బహుశ: రేపుకూడా. నేను నీ దగ్గిరకొస్తున్నాను. వంటరితనన్ని పంచడానికి” శ్రీరాం గొంతులో తుదీ మొదలూ దొరకని విషాదం.
అతడు అభిజిత్ స్నేహితుడు. మంచి ఇంటలెక్చువల్. వంటరితనాన్ని పోగొట్టుకుందుకని జీవనిని పెళ్ళిచేసుకున్నాడు. రెండుమూడేళ్ళపాటు ప్రపంచాన్ని మర్చిపోయి తమకోసమే బతికారు భార్యాభర్తలు. ఇద్దరు పిల్లలు పుట్టారు. తర్వాత ఎవరి కెరీర్‍లోకి వాళ్ళు నిశ్శబ్దంగా చేరిపోయారు. పిల్లలు క్రెష్‍లనుంచీ
హాస్టల్‍కి ప్రస్థానించారు. శ్రీరాంలో మళ్ళీ అదే వంటరితనం మిగిలింది. ఐతే అతని వంటరితనం వ్యక్తికో వ్యక్తిత్వానికో సంబంధించినది కాదు. భార్యాభర్తలిద్దరూ ఒకే ఫీల్డుకి చెందినవారైతే సైద్ధాంతిక ఏకీకరణతోనో విబేధాలతోనో ఇగో క్లాషెస్ వచ్చి విడిపోవడం చాలా ఎక్కువ. అందుకే అతను వేరే ఫీల్డులో వున్న జీవనిని చేసుకున్నాడు. ఆమెలోకూడా అలాంటిదే అవగాహన అతని దగ్గిరకి చేర్చింది.
కుటుంబసంబంధాలనేవి ఇప్పుడు పెద్దగా ఏవీ లేవు. భార్య, భర్త, పిల్లలు… పిల్లలు ఇద్దరికీ చెందినవాళ్ళో, ఇద్దర్లో ఎవరో ఒకరికి చెందినవారో… మిశ్రమసంతతో …అంతే. ఇల్లు అనేదొక కాన్సెప్టు. దాన్ని అర్థంచేసుకోవడంమీదా, అభిరుచిమీదా ఆధారపడి వుంటుంది. అంతకుమించి చర్చించుకోవటానికిగానీ, వంటరితనాన్ని తొలగించుకోవడానికిగానీ ఏమీ లేవు.
ఐనాసరే, అభిజిత్‍తో “నువ్వూ పెళ్ళిచేసుకో” అంటాడు.
“చేసుకుని నువ్వేం సాధించావు?” అని అడిగితే,
“నీకిలా చెప్పగలిగే అధికారాన్ని” అంటూ నవ్వేస్తాడు.
దాదాపు అరగంట పట్టింది శ్రీరాం రావటానికి. అతను తీసుకొచ్చిన వస్తువుని పరీక్షగా చూసాడు అభిజిత్. బొటనవేలి గోరంత వున్న ఆ వస్తువు ఇప్పుడు తామంతా వాడుతున్న మెమొరీ చిప్‍లా వుంది. అదక్కడ ఎందుకుంది? ఎవరేనా దాన్నక్కడ పెట్టి మర్చిపోయారా? లేక తమ దృష్టిలో పడాలని కావాలనే పెట్టారా? ఏముంది దాన్లో? అనేక ప్రశ్నలు.
కంప్యూటర్లో పెడితే ఒక స్లాట్‍లో సరిగ్గా సరిపోయింది. సందేహిస్తునే సిస్టం ఆన్ చేసాడు. దాని ప్రాపర్టీస్‍లో బైటపడిన నిజం అతన్ని వూపిరి బిగబట్టేలా చేసింది. అది లక్షసంవత్సరాలనాటిది. తను సరిగ్గానే చూసాడా అనే అనుమానం కలిగింది. ఫైల్ ప్రాపర్టీస్‍లో ఏదో అర్థమవని తేదీ. .. కంప్యూటర్ వప్పుకోవటంలేదు ఆ తేదీని. సిస్టం డేట్‍ని చిప్ డేట్‍కి సరిచేసాడు. కాలచక్రం గిర్రుమని తిరిగిపోయింది.
“నేను నమ్మను” అన్నాడు శ్రీరాం.
“కంప్యూటరు తప్పు చెప్పదు.”
“లాజికల్‍గా కూడా చెప్పదు.”
అభిజిత్ నవ్వాడు.
“నీ వయసిప్పుడు ఇరవై ఎనిమిదేళ్ళు. నా వయసు ముప్పైరెండు. ముప్పయ్యేళ్ళక్రితం మన వయసులెంతో అడుగు. మైనస్ రెండు, రెండు అని చెప్తుంది అర్థంలేకుండా.”
అభిజిత్ మళ్ళీ నవ్వి నెమ్మదిగా అన్నాడు, ” ఇప్పుడు నేనున్నాను. ముప్పయ్యేళ్ళక్రితం నేను లేకపోయినా మైనస్ రెండు అనేది రెండేళ్ళ తర్వాత నేను వుండటానికి క్లూ ఇవ్వడంలేదూ? ” అని సిస్టండేట్‍ని వర్తమానంలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో పడ్డాడు. ఒకసారి అదంత పాత డేట్ దగ్గిర ఆగిపోయినా, మొరాయించినా సిస్టం క్రాష్ అయినట్టే. అతనికి ఆ విషయం తెలుసు. కానీ రిస్క్ తీసుకున్నాడు.
కొద్దిసేపటికి అతని ప్రయత్నం ఫలించింది. తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు. అది అతని స్వభావం. చిప్ మెమరీ చూసాడు. టెరాబైట్ జిప్‍డ్ డాటా వుంది. అదిరిపోయాడు. డైరెక్టరీ చూసాడు. రామాయణం, భారతం, ఖురాన్, వేదాలు, ఇంకా ఏవేవో వున్నాయి. అతన్లో దిగ్భ్రాంతి.
“అంతా వుట్టిది. ఇంటర్నెట్‍లో వున్న వైరస్‍లన్నిటినీ కలిపి ఇందులోకి ఎక్కించి వుంటారు. నువ్వెలాగా ఆడమ్స్ కేవ్ విషయంలో ఆసక్తి చూపిస్తున్నావు కాబట్టి , నిన్ను తప్పుదారి పట్టించడానికి ఎవరో ఇలా చేసి వుంటారు ” అన్నా డు శ్రీరాం.
“అన్ని వైరస్‍లూ ఒకచోట దొరికితే అంతకంటే పవర్‍ఫుల్ యాంటీవైరస్‍ని కనిపెడదాం” అన్నాడు అభిజిత్ అతని మాటల్లో సెటైర్‍ని పట్టించుకోకుండా.
శ్రీరాం అతన్ని ప్రశంసగా చూసాడు. ప్రతి అసంబద్ధతలోంచీ అతను కారణాన్ని వెతికిపట్టుకోగలడు. కానీ అతనికి రావల్సినంత గుర్తింపు రావటంలేదు. కారణం… ప్రతిచోటా ఏవో రాజకీయాలు… ఎవర్లోనూ చిత్తశుద్ధి లేదు. అందుకే నెగ్గుకు రాలేకపోతున్నాడు.
ప్రపంచంలోని ఏ భాషనేనా డీకోడ్ చెయ్యగలిగే సాఫ్ట్‌వేర్‍ని అభిజిత్ తయారు చేసాడు. భాషల పుట్టుపూర్వోత్తరాలు, వివిధ జంతువులు చేసే శబ్దాలు, మనుషులు భాషారూపకంగా చేసే శబ్దాలు… వీటన్నిటినీ మూలాల్లోంచీ అధ్యయనంచేసి ఒకదానితో ఒకటి అనుసంధానించి , ఏ వోకల్ కార్డ్స్‌లో ఎంత ఎత్తులో ఏ అక్షాంశరేఖాంశాలమీద గాలి ఎటువంటి శబ్దాలు చెయ్యగలదో లెక్కలువేసుకుని అనేక భాషల డిక్షనరీలతో సరిపోల్చి డీకోడ్ చెయ్యగలడు.
ప్రతిజంతువుకీ ఒక్కో భాష వుంటుందనేది అతని సిద్ధాంతం. అది ఆ జంతువులకే అర్థమౌతుందని అతని నమ్మకం. ఏనిమేలియా కింగ్‍డమ్‍కి చెందిన హోమోఎరక్టస్‍నుంచీ హోమోసేపియన్‍గా రూపొంది నేటి ఆధునిక మానవునిగా ఎదిగిన మనుష్యజాతి మొత్తానికీకూడా శబ్దప్రక్రియ ఒకేలా వుంటుందని చెప్తాడు. పైకి కనిపించే బేధాలు ఎన్నున్నా, అతని దృష్టిలో మౌలికమైన శబ్దలక్షణాలు ఒకటే.
ఒక ఆటవికుడి భాష దరిదాపుల్లో వున్న నాగరీకుడి భాషకి మూలమౌతుంది. అదే నాగరీకుడి భాష ఇతర ప్రాంతాలకి విస్తరించినప్పుడు మార్పులకి లోనౌతుంది. అవన్నీ బైటి మార్పులు. వీటన్నిటికీ మూలాధారంగా అతను నమ్మే సిద్ధాంతాలు ఇంకొన్ని వున్నాయి.
మానవజాతి విస్తరణ ఒక ప్రత్యేక ప్రాంతంనుంచీ మొదలైందనేది మొదటిదైతే మనిషిలో వున్న అత్యంత పురాతనమిన జన్యువు ….అతడి ప్రప్రథమపూర్వీకుడిది. అదే మనిషి మెదడులోని న్యూరోమీటర్లని నియంత్రించి ఏ లక్షణాలైతే అతన్ని హోమోసేపియన్‍గా గుర్తించాయో వాటిని ప్రమోట్ చేస్తుంది. అప్పుడు మనుష్యులందరి ఇన్స్టింక్ట్స్, ఇంపల్సెస్, మైండ్ సెట్ మౌలికంగా ఒకేలా వుంటాయనేది రెండోది.
ప్రపంచంలోని ఎన్నో భాషలని , ముఖ్యంగా తెలుగుని అతను చాలా సంస్కరించాడు. ఈ ప్రక్రియలోనే తెలుగు అనేది అన్ని భాషలకీ మాతృక అనేది అర్థమైంది.
అతని పరిశోధనలనుంచీ లబ్ధిని పొందుతూకూడా అతని సిద్ధాంతాలని ఎవరూకూడా వప్పుకోకపోవడం పెద్ద ఐరనీ. ఐతే దాన్నతడు పట్టించుకోడు. ఏవో కనిపెడుతూ వుంటాడు, పేపర్లు రిలీజ్ చేస్తూ వుంటాడు. అప్పటిదాకా వుండిన నమ్మకాల మూలాలు కదుల్తుంటాయి. శాస్త్రవేత్తల గుంపు వాటిని ఖండిస్తుంటుంది. అతను వివరణలిస్తాడు. అంతేతప్ప పేటెంట్లకోసం ప్రయత్నించడు. ఆ నిరాసక్తతకూడా అతన్ని దెబ్బతీస్తోంది.
శ్రీరాంకీ అతనికీ చాలాకాలంగా పరిచయం. శ్రీరాం పేరుని అలా మార్చింది అతనే. అంతకుముందు అది శీరం అనే అపభ్రంశంగా వుండేది. దానిమీద పేరుకుపోయిన కాలపుపొరలని తొలగించి మూలాన్ని బైటికి తీసి అభిజిత్ సరిచేసాడు. దాని ప్రాముఖ్యతనీ , పుట్టుపూర్వోత్తరాలనీ వివరించి చెప్పాడు. అలా మొదలైంది వాళ్ళ పరిచయం. ప్రగాఢస్నేహంగా మారింది.
అభిజిత్ చేసే ప్రయోగాలమీద శ్రీరాంకి చాలా ఆసక్తి. తన వునికియొక్క మూలాలని తెలుసుకోవాలని ఎవరికి వుండదు? అభిజిత్‍కి కలిగే సందేహాల్లాంటివే అతనికీ కలుగుతాయి. కానీ అతడు అభిజిత్‍లా తాత్త్వికుడు కాదు.
ఆ చిప్ లక్షసంవత్సరాలనాటిదంటే ఇద్దరికీ నమ్మకం కలగటం లేదు. అందులో టెరాబైట్ జిప్ప్‌డ్ డాటా వుందంటే ఇంకా ఆశ్చర్యంగా వుంది. అంత చిన్న చిప్‍లో? అలాంటి టెక్నాలజీ ఇప్పటికింకా అందుబాటులోకి రాలేదు. మరిది నిజంగా అప్పటిదేనా? ఎటూ అంతుచిక్కని సందిగ్ధం.
లక్ష సంవత్సరాలక్రితం కంప్యూటర్లుండేవా? మనుష్యులుండేవారా? తమలాగా చదువుకుని, అడ్వాన్స్‌డ్‍గా? ఉంటె తమలాంటి ఆలోచనలే వాళ్ళకీ వుండేవా? శ్రీరామైతే నవ్వేసేవాడు ఆ వూహకి. కానీ అభిజిత్ కి నవ్వు రాలేదు. ఏదో చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వుంది అతనికి. నమ్మకం మనిషిని విషయంయొక్క మూలందాకా తీసుకెళ్తుంది. అపనమ్మకం అదే విషయాన్ని పైపైన చూపించి వదిలేస్తుంది. అతను దేన్నేనా లోతుగానే పరిశీలిస్తాడు. మైండ్‍సెట్‍ని నియంత్రించడానికి ఆ ఒక్క పురాతనమైన జీన్ చాలుననేది అతని నమ్మకం. దాన్నిబట్టే మనిషికి సంబంధించిన, మనిషితో ప్రమేయం వున్న విషయాలు జరుగుతాయని అతని విశ్వాసం.
అదే బిట్ బైట్ టెక్నాలజీ. రెండు హైడ్రొజెన్ పరమాణువులు ఒక ఆక్సిజెన్ పరమాణువుతో సంయోగం చెందితే వచ్చేది నీరే. దాన్ని ఇంకే పేరుతో పిలిచినాగానీ. ఇంకదేన్ని ఆ పేరుతో పిలిచినా ఆ లక్షణాలైతే వుండవు. అంతే.
“అంతా వట్టిదే అభీ! ఎవరో మనని ఆటపట్టించడానికి ఇలా చేసివుంటారు. లక్షసంవత్సరాలక్రితం… కంప్యూటర్లు….ఇట్సె జోక్” అన్నాడు శ్రీరాం.
“కాదు. ఇంకేదో వుంది” స్థిరంగా వచ్చింది అభిజిత్ జవాబు.
“ప్రణవిని పెళ్ళిచేసుకో. బాగుపడతావు” నవ్వాడు శ్రీరామ్.
“నన్ను బాగుచెయ్యటం తనకి సాధ్యమేనంటావా?” తనూ నవ్వి అడిగాడు.
“ప్రయత్నించి చూస్తానంటోంది. ఒక అవకాశం ఇవ్వకూడదూ?”
అభిజిత్ మొహంలో నవ్వు మాయమైంది. “ఎందుకో తెలీదు. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. పెళ్ళి చేసుకుంటే ఎన్నిటినో వదులుకోవాలి . పెళ్ళిని వదులుకుంటే అవన్నీ మిగుల్తాయి. నాకు చాలా స్పేస్ కావాలి. మరొకరితో దాన్ని నేను పంచుకోలేను. నాతో తను సుఖపడదు. నువ్వు తనకి నచ్చజెప్పు. తను చాలా మంచిది. నువ్వు చెప్తే వింటుంది” అన్నాడు.
ఈ ప్రస్తావన ఇద్దరిమధ్యా చాలాసార్లు వచ్చింది. ఇలాగే ముగిసింది. చాలా ఇంటలెక్చువల్ అతను. ఇన్నర్ స్పేస్ చాలాకావాలి అతని ఆలోచనలకి. దాన్ని విస్తరించుకునే ప్రయత్నంలో అతను బాహ్యప్రపంచాన్ని దూరంగా నెట్టేసాడు. తల్లిదండ్రులుకూడా అతనికి పరాయివాళ్ళే. వాళ్ళు అతన్ని కోరుకుని రావాలిగానీ అతని స్మృతిపథంలో వాళ్ళు కదిలేది చాలా అరుదు. దాదాపు లేదనే చెప్పాలి.
చాలాసేపు ఇద్దరూ మౌనంగా వున్నాక –
“ఇంక పడుక్కుందాం. డేట్ మారిపోయి చాలాసేపయింది” అని గుడ్ నైట్ చెప్పేసాడు శ్రీరాం. అక్కడికక్కడే బెడ్ మీద వొరిగాడు. వెంటనే నిద్రలోకి జారిపోయాడు. అభిజిత్ వంటరిగా మిగిలిపోయాడు. నిద్రదేవత ఎప్పుడో శపించిందతన్ని, సరస్వతీపూజలో పడి ఆమెని మర్చిపోయినందుకు.
కంప్యూటర్ చిప్ అతని మెదడుని తొలుస్తోంది. మళ్ళీ వెళ్ళి సిస్టం ముందు కూర్చున్నాడు. పేజీలు తిరిగిపోతున్నాయి. ఎవరు తయారుచేసారు ఇవన్నీ? ఆ గుహలోకి ఎలా వచ్చాయి? లక్షసంవత్సరాలు నిజమేనా? అతనికి విసుగొచ్చేస్తోంది. కళ్ళు, మెదడు, శరీరం – మూడూ అలిసిపోయిన స్థితిలో కూర్చున్నచోటే నిద్రలోకి జారిపోయాడు.
అప్పటికి తెల్లవారింది. శ్రీరాం నిద్రలేచాడు. అతన్నలా చూసేసరికి గుండెల్లో సన్నటి బాధ. ఎందుకిలా మానవసంబంధాల పంజరాన్ని తెరుచుకుని విజ్ఞానశాస్త్రపు అంతరిక్షంలో ఎవరికీ అందనంత దూరాన్న విహరిస్తాడు? ప్రకృతిరహస్యాలని తెలుసుకుని ఏం చేస్తాడు? ఏం చెయ్యగలడు? ఇంత పెద్దదైన, బలమైన వ్యవస్థలో ఎవరికి చెప్పి దేన్ని నియంత్రించగలడు? చిన్నగా నిట్టూర్చి, చప్పుడవకుండా బయటినుంచీ లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు.