ఆమె మారిపోయింది by S Sridevi

  1. దిక్సూచి by S Sridevi
  2. తుఫాను వెలిసింది by S Sridevi
  3. అమ్మ కొట్టిందా? by S Sridevi
  4. ఆమె మారిపోయింది by S Sridevi
  5. కదిలే మేఘం by S Sridevi
  6. క్రిస్‍మస్ చెట్టూ, పెళ్ళీ Translation by S Sridevi
  7. ఐదోది by S Sridevi
  8. పునరపి – 1 by S Sridevi
  9. పునరపి – 2 by S Sridevi
  10. పునరపి – 3 by S Sridevi
  11. సైబీరియాలో ప్రవాసానికి Translation by S Sridevi
  12. బలిదానం – 1 by S Sridevi
  13. బలిదానం – 2 by S Sridevi
  14. గమనం by S Sridevi
  15. పందెం (The bet) – Translation by S Sridevi
  16. వాకిట్లో అభ్యుదయం by S Sridevi
  17. ఆఖరి అవసరం by S Sridevi
  18. ఆవిడ మా అమ్మే by S Sridevi
  19. ఒక గొప్ప తీర్మానం by S Sridevi
  20. చట్టబంధం by S Sridevi

పగిలిన టీ కప్పు ముక్కలు గదంతా చిందరవందరగా పడి వున్నాయి. అందులోంచీ వొలికి టీ మరకలు గచ్చంతా పరుచుకున్నాయి. కొన్ని ఆరినవి, కొన్ని ఇంకా ఆరనివి.
ఆమె డైనింగ్‍టేబుల్ ముందు రెండుచేతుల్తోనూ తల నొక్కుకుంటూ కూర్చుని వుంది.
పెద్దసోఫాలో ఒక మూలకి తడి తువ్వాలు వుండ…
సోఫాకీ షూరేక్‍కీ మధ్య విడిచిన షూస్, వాటికి కొంచెం దూరంగా సాక్స్…
షూ రేక్‍మీద సగం చదివిన పేపరు…
బెడ్‍రూమ్‍లోంచీ బాత్రూంకి వెళ్ళేదార్లో విడిచిన బట్టలు…
సోఫాలమీదా కుర్చీలమీదా ఎక్కడంటే అక్కడ నిండిపోయిన దుమ్ము…
“నువ్వు చాలా మారిపోయావు ప్రమీలా! చాలా… ” బయటికి వెళ్ళడానికి తయారయ్యి దబదబ అడుగులు వేస్తూ అన్నాడు అతను.
“ఇల్లు చాలా అందంగా వుంచేదానివి. ఎక్కడా పిసరంత దుమ్ముకూడా కనిపించేది కాదు. పనిమనిషినికూడా పెట్టుకోకుండా పనంతా చేసుకునేదానివి. ఏమైంది అసలు నీకు? “
“…”
“ఇంటికి అతిథులు వస్తే పొందికగా అలంకరించి చూయించేదానివి. చెత్త కుక్కినట్టు అన్నీ కప్‍బోర్డ్స్‌లోకి తోసేసి బిల్డప్ ఇచ్చి వాళ్ళు వెళ్ళగానే వూపిరి పీల్చుకుంటున్నావు”
“…”
“పదిరకాలు ఇష్టంగా వండిపెట్టేదానివి. స్విగ్గీలు, జొమాటోలూ వరసకడుతున్నారు”
“…”
“పుస్తకాలూ, టీవీ, సెల్… ఇదే నీ కాలక్షేపం. ఇదివరకూ నా చుట్టూ తిరిగి ఏం కావాలో చూసుకునేదానివి. తాగిన కాఫీకప్పుకూడా అలాగే వదిలేస్తున్నావు”
“…”
“ప్రతిదానికీ నామీద కంప్లెయింటు… తడి తువ్వాలు సోఫాలోనో బెడ్‍మీదో పడేస్తాననీ, షూస్ రేక్‍లో వుంచననీ… అన్నీ నీకు ఫిర్యాదులే. కోపం. విసుగు… ముప్పయ్యేళ్ళుగా ఇలాగేగా వున్నాను? కొత్తగా ఏం జరిగిందని? నువ్వు చాలా మారిపోయావు…ప్రమీలా!”
అతను ఇంట్లోంచీ వెళ్ళిపోయినట్టు దూరమైన అడుగుల చప్పుడు. తెరిచిన వదిలేసిన గేటు.